NTV Telugu Site icon

TRS vs BJP: మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ

Trs Vs Bjp In Mancherial District

Trs Vs Bjp In Mancherial District

Clash between TRS and BJP parties in Mancherial district: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగాయి. కర్రలు, చెప్పులతో రెండు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన తెలియజేస్తుంటే.. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలిపాయి. మంచిర్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు గో బ్యాక్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. దీనికి పోటీగా బై బై మోదీ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో.. ముందుగా వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Read Also: Kishan Reddy: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీఆర్ఎస్ ఆరోపణలు..

వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెస్య్కూ సిబ్బంది, పోలీసులు ఇరు వర్గాలను విడదీసే ప్రయత్నం చేసినా.. కూడా ఇరు పార్టీ కార్యకర్తలు ఘర్షణ ఆపలేదు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఇదే విధంగా కేంద్రం పెంచిన జీఎస్టీపై టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కూడా ఆందోళనలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా ఐబీ చౌరస్తాకు చేరుకోవడంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి, పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. రెండు పార్టీల నాయకులు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. బీజేపీ మహిళా నాయకురాలు ఘర్షణలో కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది.

Show comments