TRS MLC TATA Madhu Fired On Telangana BJP Leaders.
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లు పరిస్థితి ఉంది. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తూంటే.. మరోవైపు టీఆర్‌ఎస్ నేతలపై బీజేపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించిస్తున్నారు. అయితే ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై దశల వారి ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. పంజాబ్ తరహాలో కేంద్రమే తెలంగాణాలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాకుండా గిరిజన బిల్లుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అబద్దాలు ఆడుతున్నారన్నారు. బీజేపీ మత విద్వేషాలతో రాజకీయం చేస్తుందని, కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక అబద్దాల పుట్ట అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, పంజాబ్‌లో ఒక లాగా తెలంగాణాలో ఒక లాగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. దేశం మొత్తం ఓకేలాగా ధాన్యం సేకరించాలని, కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
