Satyavathi Rathod: ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సత్యవతి రాథోడ్ ను స్వంత పార్టీనేతలు అడ్డుకున్నారు. ఈరోజు ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ ను గట్టమ్మ దేవాలయ సమీపంలో ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ని అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు దళిత బందు ఇవ్వని మంత్రులు నేతలు ములుగు గడ్డ పైన అడుగు పెట్టొద్దంటు నినాదాలు చేశారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ,మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్ళు పట్టుకొని దళితుల న్యాయం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలు వేడుకున్నారు. ఎంపీ కవిత కార్యకర్తలను ఏమి చేసింది, మంత్రిగా మీరు న్యాయం చేయాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేసారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, నేతలు, దళిత బందు మంజూరులో ములుగు ఎమ్మెల్యేకు సహకరించడం ఏంటి అంటూ కార్యకర్తలు నిలదీశారు.
వర్షం సైతం లెక్క చెయ్యకుండా టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి సత్యవతి రాథోడ్ అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసు నేతలకు నచ్చచెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ సైతం టీఆర్ఎస్, ఎస్ సి సెల్ కార్యకర్తల బాధలను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళుతానంటూ హామీ ఇచ్చారు దింతో దళిత కార్యకర్తలు శాంతించారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనేందుకు తావు లేకుండా కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వంత పార్టీనేతలే మంత్రిని న్యాయం చేయాలని కోరడం చర్చకు దారితీస్తోంది. స్వంత పార్టీలోనే న్యాయం చేయని టీఆర్‌ఎస్ పార్టీ ఇక ప్రజలకు న్యాయం చేసేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ స్వంత పార్టీ నేతలు కాళ్లు పట్టి న్యాయం చేయాలని వేడుకోవడంతో.. దళితులకు న్యాయం జరిగేనా? అనే ప్రశ్నలు తెరలేపుతున్నాయి. మరి దీనిపై సత్యవతి రాథోడ్ స్పందించి దళితులకు న్యాయం జరిగేలా చూస్తారా? వేచి చూడాలి.
Pegasus Row in Ap Assembly: ఏపీ అసెంబ్లీ ముందుకి పెగాసస్ నివేదిక