తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేసింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో ధర్నాలు… జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను పూర్తి చేసిన టీఆర్ఎస్… గురువారం జిల్లా కేంద్రాలు… కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు చేపట్టింది. వరుస ఆందోళనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. శుక్రవారం నల్ల జెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాయి టీఆర్ఎస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలు విషయంలో మోడీ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు.
Read Also: TSRTC: మళ్లీ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో భారీగా వడ్డింపు..
కేంద్రంపై పోరు కొనసాగించే క్రమంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్. శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటు గ్రామాల్లో కూడా ఇళ్లపై నల్లజండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. యాసంగిలో వరి ధాన్యంను కేంద్రమే మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ ను బలంగా వినిపించింది.. ఇక, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆందోళనలు ముగిశాయి. కేంద్రంపై పోరు తీవ్రతరం చేసే క్రమంలో ఈ నెల 11 న ఢిల్లీ తెలంగాణ భవన్ లో ధర్నా నిర్వహించనుంది టీఆర్ఎస్.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు నేతలు.. తెలంగాణ భవన్‌లో వేదిక ఏర్పాటు స్థలాన్ని ఈ రోజు పరిశీలించారు టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు.
