NTV Telugu Site icon

MP Kavitha: తెలంగాణతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే..!

Kavitha

Kavitha

టీఆర్ఎస్‌ పార్టీ, బీజేపీ మధ్య రోజురోజుకీ గ్యాప్‌ పెరిగుతోంది.. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది… అయితే, తెలంగాణతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే నంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు టీఆర్ఎస్‌ ఎంపీ మాలోతు కవిత… తెలంగాణతో.. సీఎం కేసీఆర్‌తో పెట్టుకుంటే అంతే సంగతులు అని హెచ్చరించారు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆమె.. ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి అభివృద్ధి జరుగలేదన్న తీరుపై ఘాటుగా స్పందించారు.. జిల్లాలో కోనసీమను మరిపిస్తున్న పచ్చని పంటచేలు, కంటి రెప్పవేసినంత సేపు కూడా పోని కరెంట్ సరఫరా, ఇంటింటికి శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ, ప్రత్యేక పంచాయతీలుగా మారిన తండాలు, ఆధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలు చూసి మాట్లాడాలని హితవు పలికారు.. బీజేపీ ప్రభుత్వం కేవలం అదాని, అంబానీలకు కొమ్ము కాస్తూ.. వారి బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తుందని విమర్శించారు ఎంపీ మాలోతు కవిత..

Read Also: Talasani Srinivas Yadav: నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు.. మీరు హిందువులు అంటే.. మరి మేం ఎవరం..?