ప్రధాని మోదీ తప్పు చేశారు: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అటు టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవరావు మాట్లాడుతూ… పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను ప్రధాని మోదీ మంట కలిపేలా మాట్లాడారని ఆరోపించారు. పార్లమెంట్ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం సైతం ఉండదని.. పార్లమెంట్లో బిల్లు పాసింగ్ మాత్రమే ఉంటుందన్నారు. సైంటిఫిక్, అన్ సైంటిఫిక్ అంటూ ఏం ఉండదన్నారు.
Read Also: రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
విభజన బిల్లుకు బీజేపీ కూడా సపోర్ట్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ విస్మరించారని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు విమర్శించారు. విభజన సమయంలో ఆంధ్రా ఎంపీలు గడబిడ చేయడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయన్నారు. పార్లమెంట్ వ్యవహారాల్లో బిల్ పాస్ చేసే సమయంలో అనుసరించాల్సిన విషయాలు రూల్ బుక్‌లో స్పష్టంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ అసందర్భంగా మాట్లాడి తప్పు చేశారన్నారు. జార్ఖండ్ బిల్ పాస్ చేసే సమయంలో సైతం గొడవలు జరిగాయని.. ఎంపీ ఆనంద్ మోహన్ చేయి విరిగిందని కేశవరావు గుర్తుచేశారు. ప్రధాని వాఖ్యలు ఖoడించడానికి మాటలు సరిపోవటం లేదని.. ప్రధానిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంపై న్యాయసలహా తీసుకుంటామని కేకే తెలిపారు.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!