NTV Telugu Site icon

మోడీని కేసీఆర్‌ కలిస్తే బీజీపీ నేతలు వణికిపోతున్నారు.. బండి సంజయ్‌ జైలుకే..!

హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయనను యాదాద్రికి ఆహ్వానించారు కేసీఆర్.. ఇతర అంశాలను కూడా పీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మోడీని కలిశారనే కామెంట్లు కూడా వినబడ్డాయి.. అయితే, ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్… సీఎం కేసీఆర్ భయపడి ప్రధాని మోడీని కలవలేదని.. భయపడే నైజం కేసీఆర్ ది కాదన్న ఆయన.. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానిని కలవడం తప్పా? అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధానిని కలిస్తే తెలంగాణ బీజేపీ నేతలు గజగజ వణుకుతున్నారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కేసీఆర్.. మోడీని కలిస్తే రాష్ట్ర బీజేపీ నేతల చిట్టా బయటపడుతుందని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక, మత విద్వేషాలను రెచ్చగొడితే బండి సంజయ్ జైలుకు పోవడం ఖాయం అని కామెంట్ చేశారు ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్.