ఈటల ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు బంధు పథకం డబ్బుల విషయంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి… ఈటల రాజీనామా తర్వాత ఆయన రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు ఎంత అందుకున్నది అనే లెక్కలు వైరల్‌గా మారిపోయాయి.. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన పల్లా… రైతు బంధు వద్దు అనిపించినప్పుడు సీఎం కేసీఆర్‌కు ఎందుకు చెప్పలేక పోయారంటూ ఈటలను నిలదీశారు.. ఇక, హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 రైతు వేదికలు నిర్మించినట్టు తెలిపారు రాజేశ్వర్‌రెడ్డి.. మరో తొమ్మిది రైతు వేదికలు ప్రారంభించుకోవాల్సి ఉందన్న ఆయన.. దేశంలో ఎక్కడ రైతు వేదికలు లేవని గుర్తు చేశారు..
మరోవైపు 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి… కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రైతు సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతు బంధు, రైతు వేదికలు, రైతు బీమా ఇలా ఎన్నో పథకాలు కేసీఆర్ తీసుకు వచ్చారని గుర్తుచేసిన ఆయన.. రైతు పథకాలను కొందరు అవమానిస్తున్నారని మండిపడ్డారు.. భూమి లేని దళిత రైతులకు కూడ రైతు బీమా స్కీమ్ వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!