Site icon NTV Telugu

రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి..

Gutta Sukender Reddy

Gutta Sukender Reddy

రైతుల సంక్షేమం విషయంలో దేశానికే మార్గదర్శి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటూ ప్రశంసలు కురిపించారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి… నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీయే అంటూ మండిపడ్డారు… రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్ సీఐ గోదాముల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు… ఇక, ధాన్యం సేకరణ పై కేంద్రం స్పష్టమైన ప్రకటన పార్లమెంట్‌లో చేయాలని సూచించారు గుత్తా.. మరోవైపు… ఈ నెల 10వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం భారీగా పెంచారు సీఎం కేసీఆర్‌ అని గుర్తు చేసిన ఆయన.. స్ధానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే అని ఆరోపించారు.

Exit mobile version