NTV Telugu Site icon

మండ‌లి ప్రొటెం ఛైర్మ‌న్‌గా భూపాల్‌రెడ్డి.. గుత్తాతో భేటీ..

Bhupal Reddy

తెలంగాణ‌ శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియ‌మించారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్… చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డితో పాటు డిప్యూటీ చైర్మ‌న్ నేతి విద్యాసాగ‌ర్ రావు ప‌ద‌వులు ఖాళీ కావ‌డంతో ప్రొటెం చైర్మ‌న్‌ను గ‌వ‌ర్న‌ర్ నియ‌మించారు. మండ‌లికి చైర్మ‌న్‌ను ఎన్నుకునే వ‌ర‌కు భూపాల్ రెడ్డి ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించడం, కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవటం, ఇతర మండలి వ్యవహారాలు చూసుకొంటారు. సాధారణ చైర్మన్‌, స్పీకర్‌కు ఉండే అన్ని అధికారాలుంటాయి. ఎస్కార్ట్‌, ప్రొటోకాల్‌, జీతభత్యాలు, బంగ్లా సౌకర్యాలు కూడా ఉంటాయి.. ఇక‌, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, నేతి విద్యాసాగ‌ర్‌తో పాటు మ‌రో న‌లుగురు ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం ఇవాళ్టితో ముగిసిపోయింది.. మ‌రోవైపు.. గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా క‌లిశారు ప్రొటెం చైర్మన్ గా నియమితులైన వెన్నవరం భూపాల్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా భూపాల్ రెడ్డి గారికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.