NTV Telugu Site icon

TRS Party: కేంద్ర మంత్రులు దగుల్బాజీ మాటలు మానుకోవాలి

Kishanreddy

Kishanreddy

TRS MLAs fire on Union Minister Kishan Reddy: కేంద్ర మంత్రులు దగుల్బాజీ మాటలు మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫైర్ అయ్యారు. హన్మకొండలో ప్రెస్ మీట్‌ నిర్వహించి బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని తన్ని తరిమే సమయం వచ్చిందని మండిపడ్డారు. ఖబడ్దార్ బీజేపీ నేతల్లారా అంటూ హెచ్చరించారు. -తెలంగాణ హక్కులు తుంగలో తొక్కితే మసైపోతారు జాగ్రత్త అంటూ మండిపడ్డారు. ఎందుకు మాపై ఈ వివక్ష..? ఎందుకు ఇంతలా విషం కక్కుతున్నారు? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాల్సిందే అని డిమాండ్‌ చేశారు. లేకపోతే మరోపోరు తప్పదు అని హెచ్చరించారు. బతుకమ్మ ఉత్సవాలలో ఎక్కడా కంటికి కనిపించని బీజేపీ నేతలు ఇప్పుడు కపట ప్రేమలు నటిస్తున్నారని విమర్శించారు. -కిషన్ రెడ్డి మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలోని ప్రతీ ఒక్కరిని తీవ్ర నిరుత్సాహపర్చాయని అన్నారు. బీజేపీ నేతలది తెలంగాణపై కపట ప్రేమ అంటూ విమర్శించారు. పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలుచేయాలని టీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.
Sky Movie: చివరి దశలో ఒంటరి వ్యక్తి జీవిత కథ!