Site icon NTV Telugu

తీన్మార్ మల్లన్నను ఉరికించి కొడ‌తాం : జీవ‌న్ రెడ్డి వార్నింగ్‌

తీన్మార్ మ‌ల్ల‌న్న వ్యవ‌హారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీన్మార్ మల్లన్నను ఉరికించి కొట్టాలని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు నిచ్చారు. ఆయన జర్నలిస్ట్ కాదు…బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడని మండిప‌డ్డారు. మంత్రి కెటిఆర్ కుమారుడి గురించి ఇష్టారాజ్యాంగ మాట్లాడుతాడా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి కెటిఆర్ ఫ్యామిలీ మీద మరొక్కసారి మాట్లాడితే మా గులాబీ సైన్యం బట్టలూడదీసి కొడతుంద‌ని హెచ్చరించారు.

https://ntvtelugu.com/bandi-sanjay-slams-munawar-farooqi/

మా నేత కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా అభిమానులు ఊరుకుంటారా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ బియ్యానికి బిజెపి దయ్యంలా మారిందని మండి ప‌డ్డారు. కేసీఆర్ రైతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే బిజెపి, కాంగ్రెస్ బూతులకు అంబాసిడర్లుగా మారారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో చంద్రబాబుకు బంట్రోతులా మారిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు బిజెపికి బంత్రోతులా మారాడని నిప్పులుచెరిగారు.

Exit mobile version