NTV Telugu Site icon

బ్రేకింగ్‌: ఎమ్మెల్యే దానంకు 6 నెలల జైలు శిక్ష విధింపు..!

Danam Nagender

Danam Nagender

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్‌ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి చేసిన కోర్టు.. దానం నాగేందర్‌తో పాటు మరోకరిపై నేరం రుజువు అయినట్లు తెలియజేస్తూ యూ/సీ 255(2) సీఆర్‌పీసీ ప్రకారం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది.. ఒకవేళ జరిమానా మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఒక్కొక్కరికి 6 నెలల శిక్షను ఖరారు చేసింది కోర్టు.. ఇక, దీనిపై అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.. మరోవైపు ఇదే కోర్టులో తిరుపతి వర్మ అనే న్యాయవాదిని కొట్టిన కేసులో కూడా దానం నాగేందర్ పై మరో కేసు విచారణలో ఉంది.