Balka Suman: వైఎస్ఆర్ టీపీ షర్మిల పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హైద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు. అడ్డగోలుగా మాట్లాడే భాషే ఇందుకు కారణం కానుందని బాల్క సుమన్ తెలిపారు. తమ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి గురించి గవర్నర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తమను షర్మిల దూషించిన విషయం కూడా గవర్నర్ తెలియనట్టుందన్నారు. సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. ఎవరిని పడితే ఏది పడితే మాట్లాడితే ఎలా అని సుమన్ అడిగారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నల్లి లాగా నలిపివెస్తం అన్నారు. మేము అనుకుంటే షర్మిల ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదని వార్నింగ్ ఇచ్చారు. సర్పంచ్ గా కూడా గెలవని షర్మిల బతుకెంతా? అంటూ ప్రశ్నించారు. షర్మిల ఏ పక్షమే ఎవరెవరికి తెలుసు? అని అన్నారు. ఏపీ సీఎం జగన్, వైఎస్ఆర్ టీపీ షర్మిల తెలంగాణను వ్యతిరేకించారు దాని ఫ్రూఫ్ కూడా వీడియోలు ఉన్నాయని మీడియా ముందు పెట్టారు.
Reada also: Andhra Pradesh: ఎన్నికల విధుల నుంచి టీచర్లు అవుట్.. మరి ఎవరు నిర్వహిస్తారు?
పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణలో తిరుగుతూ తమనే దూషిస్తున్నారన్నారు. తెలంగాణ పోరాటం గురించి షర్మిలకు ఏం తెలుసో చెప్పాలన్నారు. పరాయి మనుషులు కిరాయి మనుషులతో తెలంగాణలో చేస్తున్న తోలుబొమ్మలాటను పెద్దగా పట్టించుకోవాల్సిన అవససరం లేదని బాల్క సుమన్ చెప్పారు. షర్మిల ఎవరు, ఆమె వెనుక ఉన్న వారెవరో తెలంగాణ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సుమన్ కోరారు.అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్న తీరును కూడా ప్రజలు గమనించాలన్నారు. ఓపిక సహనం నషిస్తా ఉంది,మా క్యాడర్ కు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిషత్ లో ఏమి జరిగిన బాధ్యత మాది కాదు.. టీఆర్ఎస్ ది కాదు అంటూ మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఏమి జరిగినా వాల్లే బాధ్యులు అని తెలిపారు. చిల్లర వాళ్ళను పట్టించుకోమమి సంచళన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కు కవిత ఇంటి మీదకు వచ్చినప్పుడు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే లపై షర్మిల మాట్లాడినప్పుడు గవర్నర్ కు కనిపించడం లేదా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు బాల్కా సుమన్.
