Site icon NTV Telugu

Balka Suman : బీజేపీ ఎంపీలు దద్దమ్మలా.. సన్నాసులా..

TRS MLA Balka Suman Fired On Telangana BJP Leaders.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, పభుత్వం విప్‌ బాల్క సుమన్‌ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నుంచి ఓ పథకం ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండై మా మీద నెపం నెడుతున్నారన్నారు. హిమాచల్‌లో దత్తాత్రేయ గవర్నర్‌గా ఉన్నప్పుడు 6 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదా అన్నారు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా బీజేపీని చూసి సిగ్గుపడుతున్నాయని విమర్శించారు. విభజన చట్టం హామీలపై బీజేపీ ఎంపీలు ఢిల్లీలో దీక్షలు చేయాలని, రాజ్యాంగ పరిరక్షణ దీక్షలు ఢిల్లీలో చేయాలి ఇక్కడ కాదన్నారు.

మోడీని అమిత్ షా ను చూస్తే ఇక్కడి బీజేపీ నేతల లాగులు తడుస్తాయా.. ఎందుకు పార్లమెంట్ లో విభజన హామీల పై నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ లు దద్దమ్మ లా… సన్నాసులా అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ నేతలది కుట్ర పూరిత రాజకీయం. ఇది తెలంగాణ లో నడవదు.. కాళేశ్వరానికి జాతీయ హోదా గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదు.. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీకి కర్ర కాల్చి వాత పెడతారని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఉత్తర భారత రాజకీయం తెలంగాణలో నడవదని, తెలంగాణ పచ్చగా ఉండొద్దు ఎండి పోవాలని బీజేపీ కోరుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.

https://ntvtelugu.com/minister-srinivas-goud-inaugurated-new-boating/
Exit mobile version