Site icon NTV Telugu

TRS Twitter: బీజేపీపై టీఆర్ఎస్ ట్విట‌ర్ వార్‌.. సీఎం ప్రశ్నలకు బదులేది?

Modi, Ktr, Harishrao

Modi, Ktr, Harishrao

బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా బీజేపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఎం మోడీ సహా కేంద్ర మంత్రులు ఎవ్వరూ రాష్ట్రానికి ఉపయోగపడే మాట ఒక్కటి కూడా చెప్పలేదని విమర్శించారు. కాగా.. తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాకుండా.. అహ్మదాబాద్‌ పేరును అదానీబాద్‌గా ఎందుకు మార్చారంటూ ట్వీట్‌ చేశారు.

కాగా.. స‌భ‌సమావేశాల్లో కల్లబొర్లి మాటలు తప్ప మరేం లేదని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ ద్వారా మండిపడ్డారు చేశారు. అయితే బీజేపీ స‌భ‌పై మంత్రి హ‌రీష్ రావ్ ట్వీట్ చేసారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ఒక్క ప్రశ్నకూ బీజేపీ బదులు చెప్పలేదని పేర్కొన్నారు. కాగా.. గుజరాత్‌ ఉత్తరప్రదేశ్‌ కర్ణాటక రాష్ట్రాలపై గతంలో పలుమార్లు వరాలు కురిపించిన మోడీ, తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపారని హరీశ్‌ అన్నారు. అంతేకాదు.. రాష్ట్రపతిగా గిరిజన మహిళకు అవకాశమిచ్చామని గొప్పలు చెప్పుకున్న కేంద్ర మంత్రులకు తెలంగాణలోని గిరిజనులు కనిపించడం లేదా అని హరీశ్‌ ప్రశ్నించారు.

Maharashtra Political Crisis: నేడు ఏక్ నాథ్ షిండే బలనిరూపణ

Exit mobile version