Site icon NTV Telugu

Rajanala Srihari: మనిషికో కోడి.. క్వార్టర్ బాటిల్.. వీడియో వైరల్

Wgl Chicken

Wgl Chicken

ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. వరంగల్ కు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా క్వార్టర్ మందుసీసా,కోడిని పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరంగల్ లో కేసీఆర్,కేటీఆర్ ప్లెక్సీలు పెట్టి మందు,కోళ్లను పంపిణీ చేశారు టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి. పేద హమాలీలకు 200 కోళ్లను, 200 క్వార్టర్ బాటిళ్ళను పంపిణీ చేశారు టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి. వరంగల్ జిల్లా..తూర్పు నియోజకవర్గంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న శుభ సందర్భంగా హడావిడి చేశారు. జాతీయ పార్టీకి వారే అధ్యక్షునిగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సభ్యులు విజయం సాధించి వారు ప్రధానమంత్రి కావాలన్నారు.

Read Also: Bigg Boss: ఛీ సిగ్గుగా లేదు.. హీరోయిన్స్ ను లైంగికంగా వేధించినవాడికి సపోర్ట్ ఇవ్వమంటున్నారు

రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కల్వకుంట్ల తారకరామారావు ఎంపికై రాబోయే ఎన్నికల్లో వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. విజయదశమి వారికి విజయాలను సాధించి పెట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరంగల్ చౌరస్తాలో 200 పేద హమాలీలకు ఒక కోడి, ఒక క్వార్టర్ విస్కీ బాటిల్ విస్కీని పంపిణీ చేశారు టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి. ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

Read Also: Chintamaneni Prabhakar: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై చింతమనేని సంచలన వ్యాఖ్యలు

Exit mobile version