Site icon NTV Telugu

Boora Narsaiah Goud: ఈనెల 19న బీజేపీ కండువా కప్పుకోనున్న బూర నర్సయ్యగౌడ్

Boora Narsaiah Goud.. Bandi Sanjay

Boora Narsaiah Goud.. Bandi Sanjay

Boora Narsaiah Goud: మునుగోడు ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.

పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని, ఉప ఎన్నికల సమయంలో ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదని బూర ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని కోరడం సరికాదని, ఉద్యమ నేతలు కూడా కేసీఆర్‌ను కలిసేందుకు తిరుగులేదని టీఆర్‌ఎస్‌ పార్టీకి చేసిన రాజీనామా లేఖలో బూర నర్సయ్యగౌడ్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర సాధన కంటే పెద్ద ఉద్యమం చేయండి. మునుగోడు టిక్కట్‌ అసలు నాకు సమస్యనే కాదన్నారు బూర నర్సయ్య గౌడ్‌. బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్‌ పరిశీలించాలని అడగటం నేరమా? అంటూ ప్రశ్నించారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై అభిమానంతో కృతజ్ఞతగా ఇప్పటివరకు పార్టీలో ఉన్నానని స్పష్టంచేశారు. అభిమానం, బానిసత్వానికి చాలా తేడా ఉందని లేఖలో పేర్కొన్నారు.

Read also: World Spine Day: వెన్నెముక సమస్యతో బాధపడుతున్నారా ?

20న మునుగోడు ఎన్నికల ప్రచారం

ఈనెల 19న బీజేపీలో చేరిన అనంతరం బూర నర్సయ్యగౌడ్ మునుగోడులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ 20వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి విజయాన్ని అందించాలని బూర భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉన్నందున అక్టోబర్ చివరి వారంలో హైదరాబాద్‌లోని నాంపల్లిలో బీసీ నేతలు నర్సయ్యగౌడ్‌తో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న బూర నర్సయ్యగౌడ్‌ తొలిసారిగా వేరే పార్టీ కోసం పనిచేయనున్నారు.

Exit mobile version