ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.