Site icon NTV Telugu

Danam Nagender: అరవింద్ భాష సరిగ్గా లేదు.. మారం అంటే మేము కూడా తగ్గేది లేదు

Danam Nagender

Danam Nagender

TRS Danangender fire on MP Arvind: బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు టీఆర్ఎస్ శ్రేణులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ ఎంపీ అరవింద్‌ భాష సరిగ్గా లేదని, మారం అంటే మేము కూడా తగ్గేది లేదని దానం నాగేందర్ మండి పడ్డారు. నిన్న జరిగింది శాంపిల్ మాత్రమే అని హెచ్చరించారు. ఓపికకు …సహనానికి హద్దు ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ బాషా సరిగ్గా లేదని, కల్వకుంట్ల కవిత పై వ్యక్తిగత విమర్శలు అరవింద్ చేస్తున్నారని మండిపడ్డారు. అరవింద్ చరిత్ర చెబితే ఆయన సిగ్గుతో తల దించుకోవాలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బి ఫార్మ్ లు అమ్ముకున్న చరిత్ర ధర్మపురి అరవింద్ ది అని ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ డి.శ్రీనివాస్ కు రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి అరవింద్ బి.ఫార్మ్ లు అమ్ముకున్న వారందరినీ తీసుకొచ్చి నిలబెడత అంటూ తెలిపారు. కల్వకుంట్ల కవితపై చేసిన కామెంట్స్ ను అరవింద్ విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ వ్యతిరేకులు, ద్రోహులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు అంటూ ఆరోపించారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి…మారం అంటే మేము కూడా తగ్గేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు. మా వాళ్ళను 24 గంటలుగా పోలీసు స్టేషన్ లో పెట్టారు..వాళ్లంతా ఉద్యమకారులని అన్నారు. మాట్లాడదామంటే పోలీసు కమిషనర్ ఫోన్ ఎత్తడం లేదని మండిపడ్డారు.

Read also: ChandraBabu: ‘ఇదేం కర్మ’ అంటున్న చంద్రబాబు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు బీజేపీ ఎంపీ ఇంటిని దాడి చేశారు. ఇంట్లోని పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ చర్యలకు పాల్పడిన దాదాపు 50 మందిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంట్లోకి ప్రవేశించిన గుంపు ఫర్నీచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేసింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మపురి అరవింద్ తల్లి విజయలక్ష్మి సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్ 148 (అల్లర్లు, మారణాయుధాలతో దాడి చేయడం), 149 (సాధారణ వస్తువుపై విచారణలో చట్టవిరుద్ధమైన సమావేశాన్ని ప్రాసిక్యూట్ చేయడం), 452 (గాయం, దాడి లేదా తప్పుడు జైలు శిక్షకు సిద్ధమైన తర్వాత ఇంట్లోకి చొరబడటం) కింద కేసులు నమోదు చేశారు. వీరితో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 323, 427, 354 కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Gongura: గోంగూర ఎవరు తినకూడదు?

Exit mobile version