గోంగూరలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అతిగా తింటే అనర్థాలు ఉన్నాయి.

ఈ ఆకును ముందుగా నీటిలో ఉడికించి, ఆ నీటిని పారపోసి వండుకోవాలి.

అంతేకాదు ఇలా చేయడం వల్ల కూరలో పులుపు తగ్గి.. వేయాల్సిన ఉప్పు పరిమాణం కూడా తగ్గుతుంది.

అధిక పులుపు కారణంగా ఇందులో ఎక్కువ ఉప్పును వాడాల్సి ఉంటుంది.

ఎక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

గోంగూర తరుచూ తింటే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లివర్కు బలాన్ని ఇస్తుంది, రక్తప్రసరణ సరిగా జరిగేలా చేసి, రక్తహీనతను తగ్గిస్తుంది.

మలబద్ధకాన్ని పోగొడుతుంది. రేచీకటిని తగ్గిస్తుంది. స్త్రీల గర్భకోశ సమస్యలు తగ్గించడంలో సాయపడుతుంది.

చర్మవ్యాధులు ఉన్నవారు, పంటినొప్పి, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్లు, రోగాలకు మందులు వాడేవాళ్లు గోంగూర తినవద్దు.