టిఆర్ఎస్ కీలక నిర్ణయం.. ఆ ఉప ఎన్నికల్లో పోటీకి దూరం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా మృతి చెందారు. ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఇవాళ ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరం అని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దు అని బీజేపీ నుంచి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బీజేపీ ప్రతినిధి బృందం, స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలను కూడా బీజేపీ బృందం కలిసినట్టు సమాచారం. దీనికి కాంగ్రెస్ నేతలు సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లను కలవగా వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్‌లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
తాజావార్తలు
-
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?