Liquor sales in Adilabad: మహారాష్ట్ర మద్యం తెలంగాణలోకి వచ్చేస్తుంది..అక్కడి దేశిదారు ఇక్కడికి ఇక్కడి లిక్కర్ అక్కడికి స్మగ్లింగ్ సాగిపోతుంది.. అడిగే వారులేరా..ఆడపదడపా కేసులు చేస్తే లిక్కర్ దందా ఆగిపోతుందా.. ఇంతకీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగేదేంటీ.. దాడులు చేసే వరకు మాఫియా ఎందుకు వెల్తోందనేది ప్రశ్నిగామరుతుంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లోకి మహారాష్ట్రలోని దేశిదారు మద్యం ఏరులై పారుతోంది. తక్కువ ధరకు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీనికోసం కొంతమంది మద్య మాపియాతో చేతులు కలిపి సరిహద్దుల్లో డెన్ లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే విక్రయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పెనుగంగా సరిహద్దు మండలాల్లో ఈవ్యాపారం ఎక్కువైంది. జిల్లాలోని భీంపూర్, తాంసీ, తలమడుగు ,జైనాథ్,గాదిగూడ మండలాల్లో ని పలు గ్రామాల్లో దేశిదారు ఏకంగా బెల్ట్ షాపుల్లో అమ్మేస్తున్నారు. అక్కడి నుంచి పెనుగంగా దాటి తీసుకొస్తున్నాయి. సంచులు లేదా పెట్టేల్లో గంగదాటించేస్తున్నారు. ఇక కొమురం భీం,నిర్మల్ జిల్లాలతోపాటు మహరాష్ట్ర సరిహద్దును పంచుకున్న గ్రామాల్లో లిక్కర్ దందా సాగుతోంది.
Read also: TFPC: తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలి..!
ఇల్లీగల్ గా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోని అక్కడి దేశిదారు,ఇక్కడి లిక్కర్ ను రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో విక్రయాలు చేస్తున్నారు. తెలంగాణ మద్యం ఎక్కువ రేట్లు పెంచడం అలాగే ఇక్కడ కల్తీ లిక్కర్ ఎక్కువగా ఉంటుందనే భావనలో ఉన్న సరిహద్దు ప్రాంత గ్రామాల్లో జనం దేశిదారును తాగేస్తున్నారు. ఇక్కడి లిక్కర్ కంటే అక్కడి లిక్కరుకిక్కు ఎక్కువగా ధర తక్కువ కాబట్టి అటువైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వ్యాపారం సాగుతున్నా కొన్ని చోట్ల అధికారులు మామూల్ గా తీసుకుంటున్నారు. ఏడాది కాలంలో 506 ఏడాది లీటర్లు స్వాదీనం చేసుకోగా 69 దేశిదారు కేసులు నమోదు అయ్యాయి. ఆయా కేసుల్లో 84 మంది అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణలో వ్యాపారం చేసే ఐదు మందిని బైండోవర్ చేశారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. పక్కాసమాచారం వస్తే.. ప్రెజర్ ఎక్కువగా రావడం వల్ల మాత్రమే దాడులు చేస్తారనే ఆరోపణలున్నాయి..ఎక్సైజ్ అదికారులు కొంతమంది మామూల్లకు అలవాటు పడి దేశిదారును రాష్ట్రంలోకి వచ్చిన సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపలు గుప్పుమంటున్నాయి. బెల్ట్ షాపుకు ఇంతా అని వసూల్ చేస్తున్నారని ప్రచారం జోరుగా ఉంది.
ఇదిలా ఉంటే కొంతమంది ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడానికి వెల్తే దాడులకు సైతం తెగిస్తున్నారు దేశిదారు మహారాష్ట్ర స్మగ్లర్లు. ఇటీవల భీంపూర్ మండలం అంబుగూడ కు వెల్లిన ఎక్సైజ్ ఎస్ ఐ, ముగ్గురు కానిస్టేబుళ్ల పై రాళ్ల దాడి చేయగా ఎస్ ఐతోపాటు కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. ఓ సరిహద్దు గ్రామంలో రైడ్ కెల్లిన అధికారులపై ఊరంతా కలిసి చుట్టుముట్టిన సందర్బాలున్నాయి. అధికారులు మాత్రం అబ్బే అక్కడి లిక్కర్ మనదగ్గరికే రాదంటున్నారు. పైగా మనమద్యం మంచి టేస్ట్ ఉంటుందంటున్నారు అధికారులు. మరొ కొంత మంది అధికారులు మాత్రం మనదే అటు వైపు లిక్కర్ పోతుందంటున్నారు…ఏది ఏమైనా అధికారులు పక్కరాష్ట్రం నుంచి వచ్చే ఇల్లీగల్ లిక్కర్,స్మగ్లర్ల ఆగడాలకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది..లేదంటే పూర్తిగా ఇక్కడి లిక్కర్ సేల్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
TRS MLA Balka Suman: సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలి