Liquor Smuggling : ఆదిలాబాద్ జిల్లా మద్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మహారాష్ట్ర నుంచి మద్యం సీసాలను కొత్త ఎత్తుగడలతో తరలిస్తున్న కేటుగాళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల నివేదిక ప్రకారం.. దేశిదారు మద్యం తరలింపులో నూతన మార్గాలు వెతుక్కుంటూ ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్లను దుండగులు ఉపయోగిస్తున్నారు. మద్యం సీసాలను ఈ జాకెట్లలో దాచిన వీరంతా వాటిని ఒంటిపై వేసుకొని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ కుట్ర బట్టబయలైంది.…
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లోకి మహారాష్ట్రలోని దేశిదారు మద్యం ఏరులై పారుతోంది. తక్కువ ధరకు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీనికోసం కొంతమంది మద్య మాపియాతో చేతులు కలిపి సరిహద్దుల్లో డెన్ లు ఏర్పాటు చేస్తున్నారు.