Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Transgenders Have Been Appointed As Traffic Assistants Minister Seethakka

Minister Seethakka: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాం..

Published Date :May 26, 2025 , 4:07 pm
By Chandra Shekhar Pamena
  • ట్రాన్స్ జెండర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశం..
  • ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నిధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లు సత్తా చాటుతున్నారు..
  • ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్ల నియామకం.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ: మంత్రి సీతక్క
Minister Seethakka: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Seethakka: సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాన్స్ జెండర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. గత ఆరు నెలల క్రితం ప్రయోగాత్మకంగా 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దేశంలో మొట్ట మొదటిసారిగా ట్రాఫిక్ అసిస్టెంట్గా ట్రాన్స్ జెండర్లను తీసుకుంది. కేవలం పది రోజుల్లోనే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్ను నియమించి తెలంగాణ సర్కార్ రికార్డు సృష్టించింది.

Read Also: Dil Raju: నాకు తెలంగాణాలో ఉన్నవి 30 థియేటర్లే!

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు ఉందన్నారు. కానీ దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమ సత్తాను చాటారు.. ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించారు.. గత ఆరు నెలల్లో సకాలంలో విధులకు హాజరై తమ అంకిత భావాన్ని ప్రదర్శించారని తెలిపారు. ఎంతో క్లిష్టమైన ట్రాఫిక్ డ్యూటీని క్రమశిక్షణతో వహిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలో సమర్థత ఉంటుందని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ట్రాన్స్ జెండర్లు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించాం.. ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను అని మంత్రి సీతక్క వెల్లడించారు.

Read Also: Dil Raju: పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు

ఇక, తెలంగాణ మోడల్ ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోంది.. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమను తాము నిరూపించుకున్నారు.. పోలీస్ శాఖలోనే కాకుండా ఇతర శాఖలో కూడా ట్రాన్స్ జెండర్లను నియమించే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.. ఎక్కడ ట్రాన్స్ జెండర్ల మీద వివక్షత లేకుండా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తాము అన్నారు. ట్రాన్స్ జెండర్లందరికీ ట్రాఫిక్ అసిస్టెంట్లు ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది గౌరవప్రద ఉద్యోగాలు చేసేందుకు ముందుకు రావాలి అని మంత్రి పిలుపునిచ్చారు. పోలీస్ డ్రెస్ లో ట్రాన్స్ జెండర్లను చూసి సామాన్యులు సెల్యూట్ చేస్తున్నారు.. ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న ట్రాన్స్ జెండర్లు ఇప్పుడు అపూర్వ గౌరవాన్ని అందుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. సీఎం ఇచ్చే అవకాశాలను ట్రాన్స్ జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • congress
  • Minister Seethakka
  • telangana
  • Traffic Assistants

తాజావార్తలు

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

  • Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు

  • Mrunal Thakur: లవ్‌ లైఫ్‌పై ఓపెన్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!

  • Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions