ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.. దీంతో, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు చుట్టూ పరుగులు పెడుతున్నారు.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్‌లు.. సొంతంగా ప్రిపేర్ అయ్యేవాళ్లు కూడా లేకపోలేదు.. అయితే, తాము కూడా పరీక్షలు రాస్తాం.. మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ట్రాన్స్ జెండర్స్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్‌లో పురుషులు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. మాకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: Minister Ambati: అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. బాబుపై సెటైర్లు..
పోలీస్ ఉద్యోగాల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి వచ్చారు ట్రాన్స్ జెండర్స్.. అప్లికేషన్స్ లో పురుషులకు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. ట్రాన్స్ జెండర్స్ కోటా కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాన్స్ జెండర్స్ పోలీసు ఉద్యోగాలు సాధించగలరని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కూడా ప్రస్తావిస్తున్నారు ట్రాన్స్ జెండర్స్… అంతే కాదు, పోలీసు ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించేవరకు పోరాటం చేస్తామంటున్నారు. కాగా, రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.. మరి, ట్రాన్స్ జెండర్స్ విజ్ఞప్తిపై డీజీపీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
