NTV Telugu Site icon

Transfer of IAS: తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీలు

Transfer Of Ias

Transfer Of Ias

Transfer of IAS: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలుమార్లు ఐఏఎస్‌లు బదిలీ కాగా, తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఏఎస్‌లను బదిలీ..

* సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ – నీటిపారుదల శాఖ ప్రత్యేక కారుదర్శిగా నియామకం

* షేక్ రిజ్వాన్ పాషా – గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ని జనగామ కలెక్టర్ గా నియామకం

* మిక్కిలినేని మను చౌదరి – కామారెడ్డి అదనపు కలెక్టర్ – సిద్దిపేట కలెక్టర్ గా నియామకం

* Ch. శివలింగయ్య – జనగామ కలెక్టర్ ని గాడ్ కి రిపోర్ట్ చేయాలని ఆదేశం

* శైలజా రామయ్యర్ – దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా నియామకం
Bommarillu Re-Release: ‘బొమ్మరిల్లు’ రీ-రిలీజ్.. ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే… బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది. ఇందులో టీఎస్పీఎస్సీ సెక్రెటరీగా నవీన్ నికోలస్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా అనిత రామచంద్రన్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా హనుమంతరావు ఉన్నారు. అలాగే, బీసీ వెల్ఫేర్ కమీషనర్ గా బాలమాయదేవిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు హార్టీ కల్చరర్ డైరెక్టర్ గా అశోక్ రెడ్డి, ఫిషరీస్ కమీషనర్ గా బి. గోపి, స్త్రీ శిశుసంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ కమీషనర్ గా నిర్మల కాంతి వెస్లీ, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా సీతా లక్ష్మీ, ఛీఫ్ రేషనింగ్ గా ఫనీంధ్రను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించిన విషయం తెలిసిందే..
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో లీక్..