NTV Telugu Site icon

Komaram Bheem Asifabad: విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం

Komaram Bheem Asifabad

Komaram Bheem Asifabad

Komaram Bheem Asifabad: ఒకరి నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలికొంది. పిల్లలను కంటి రెప్పలా చూసుకోవాలని పెద్దలు చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. కానీ ఆ నిర్లక్ష్యమే చిన్నారు మృత్యువాత పడుతున్నారు. అయినా చిన్నారులను నిర్లక్ష్యానికే వదిలేస్తున్నారు. ఒకరు తప్పు చేస్తే ఆపరిహారం చెల్లించలేనంతగా కొందరు చిన్నారు బలవుతున్నారు. ఒవ్యక్తి చేసిన తప్పుకు ఓతల్లికి కడుపుకోత మిగిలించిన ఘటన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మిసల్ గూడలో చోటుచేసుకుంది.

మిసల్‌ గూడ గ్రామానికి చెందిన ఆత్రం జైతు బాయి, టుల్లు లకు చెందిన అభిక మూడవ సంతానం. రోజులాగే తల్లిదండ్రులు చిన్న కూతురిని చేనుకు తీసుకెళ్లారు. అయితే.. అక్కడే వున్న చెనులో కొట్టే మందు డబ్బా మూత వుండటంతో.. అభం శుభం తెలియని ఆచిన్నారి నోటిలో పెట్టుకుంది. దీంతో ఆచిన్నారి అక్కడే పడిపోయింది. గమనించిన స్థానికులు చిన్నారి విషయం తల్లిదండ్రులకు తెలిపారు. కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా ఆచిన్నారి మార్గమధ్యంలో ప్రాణాలు వదిలింది.

read also: Robbery in Nizamabad: మిఠాయి తినిపించి.. కాళ్లు, చేతులు కట్టేసి రూ.30వేలు దోపిడీ..

ఓ రైతు చేతి పంపు వద్ద నీళ్ళు నింపుకొని పురుగుల మందు కలిపి అక్కడే పురుగుల మందు డబ్బా మూతను వదిలి వెల్లిపోయాడు. అయితే తల్లిదండ్రులు ఆచిన్నారిని వదిలి వెల్లారు. దీంతో అక్కడే వున్న చిన్నారి ఆడుకుంటూ ఆపురుగులమందు మూతను నోట్లో పెట్టుకోవడంతో ఈఘటన జరిగిందని, చిన్నారి నోట్లోకి పురుగుల మందు పోవడమే మృతి కారణమని, పాప తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి అభిత మృతి చెందడంతో.. గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ప్రొద్దునే ఆడుకుంటూ వున్న చిన్నారి కొద్ది సేపటికే మృత్యుఒడికి చేరడంతో.. కన్నీరుమున్నీరయ్యారు.
National Flag Honors: దెబ్బతిన్న జాతీయ జెండాను ఎలా గౌరవంగా పారేయాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయి..?

Show comments