Site icon NTV Telugu

Traffic Diversion : మోడీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic

Traffic

ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆప్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న స్నాతకోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు 26 తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. అయితే.. ఆ సమయంలో.. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వైపు, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి విప్రో వైపు, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపుకు వచ్చే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

Whatsapp Image 2022 05 24 At 1.48.51 Pm

Exit mobile version