NTV Telugu Site icon

పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్…..

Ponnam Prabhakar

టీఆర్ఎస్‌కు ఇప్ప‌టికే రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్.. ఇవాళ ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌డం.. అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఆమోదించ‌డం జ‌రిగిపోయాయి.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేర‌నున్న ఆయ‌న‌.. నైతిక బాధ్య‌త వ‌హిస్తూ.. టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతో.. కొత్త డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది.. ఈట‌ల రాజీనామా వ్య‌వ‌హారంపై స్పందించిన పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్.. పార్టీ మారుతున్నఈటల నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశార‌ని.. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే లు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.. లేదా.. సీఎం కేసీఆరే ఆ ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి నైతిక విలువలకు కట్టుబడాలని పొన్నం డిమాండ్ చేశారు.