తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు గురించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ పై సోనియా గాంధీ ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 9… అందుకే డిసెంబర్ 9 ఉదయం 10 గంటల నుండి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నాము అని తెలిపారు. ఈసారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుంది.కొల్లాపూర్ లో రేవంత్, మధిర లో సిఎల్పీ నేత భట్టి సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యం గా పెట్టుకున్నాము. జనవరి 26 వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నారు.
ఇక బీజేపీ..టీఆర్ఎస్ తిట్టుకుంటూ… ధాన్యం కొనుగోలు అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనిచెప్పిన ఆయన ఆఖరి గింజ కోనెలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. మళ్ళీ కల్లాళ్లో కి కాంగ్రెస్ వస్తుంది. జిల్లాల వారీగా యాత్రలు చేస్తాం.రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై తప్పుదోవ పట్టిస్తోంది. 30 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్టు అబద్దం చెప్తుంది. కేసీఆర్ మెడ మీద కత్తిపెడితే సీఎం పదవి వదులుకుంటారా అని ప్రశ్నించారు. ఇక ప్రతీ గింజా కొంటా అని… ఇప్పుడు కేంద్రం కొనడం లేదు అని కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
