Site icon NTV Telugu

బీజేపీ వైపు తుపాకీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీపై కాల్పులు..!

Jagga Reddy

తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయం మారిపోయింది.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీని వ‌దిలి.. ఇప్పుడు మొత్తం బీజేపీపై ఫోక‌స్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు టి.పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. బీజేపీ వైపు తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్ పార్టీని కాలుస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.. కేసీఆర్ తెలంగాణ లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడ‌న్న ఆయ‌న‌.. చూసే వాళ్లకు అందరికి తుపాకీ ఎక్కుపెట్టిన దిక్కే కాల్చుతాడు అనిపిస్తుంది.. కానీ, ఆయన తూటా కాంగ్రెస్ వైపు పేల్చుతున్నార‌ని విమ‌ర్శించారు..

Read Also: వంగ‌వీటి రంగా పేరు పెట్టకపోతే ఉద్య‌మ‌మే..!

ఇక‌, కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు… ఇది దురదృష్టకరం అన్నారు జ‌గ్గారెడ్డి.. తెలంగాణలో బీజేపీ నుండి ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు ఉన్నారు.. మీరందరూ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఏమి చేసినట్టు..? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. బండి సంజయ్ మా ప్రభుత్వం అదీ, ఇదీ అని నరుకుతుంటరు.. క‌దా? తెలంగాణకు నిధులు తెచ్చే విషయంలో నీ నర్కుడు ఏమైంది? అని మండిప‌డ్డారు.. నీకు ఎప్పుడూ రాజకీయాలు కావాలి తప్పా ప్రజల సంక్షేమం అక్కర్లేదు అని ఎద్దువా చేశారు.. మ‌రోవైపు.. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు.. కేసీఆర్ ఆలోచించి మాట్లాడారా, ఆలోచన లేకుండా మాట్లాడారో అర్థం కావడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు జ‌గ్గారెడ్డి.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది అంబేద్క‌ర్ రాసిన జ్యాంగం వల్లనే కదా..? అని గుర్తుచేశారు.. ఇక‌, కాంగ్రెస్ పార్టీ లేకుండా కేంద్రంలో ఏ ఫ్రంట్ కూడా అధికారంలోకి రాలేద‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.

Exit mobile version