Site icon NTV Telugu

Revanth Reddy : సన్నాసులు అమ్ముడు పోయారు

Revanth Reddy

Revanth Reddy

నేడు ఖమ్మం మాజీ కార్పొరేటర్ రాంమూర్తి నాయక్, మాజీ జడ్పీటీసీ భారతితో పాటు వారి ఆధ్వర్యంలో వెయ్యి మంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన వారికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా పార్టీలో వరుస చేరికలు జరుగతున్నాయన్నారు. మోడీ.. కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించాలని మద్దతుగా నిలుస్తున్నారని, మోడీ, కేసీఆర్‌ ఒకరికొకరు విలన్‌ లుగా చిత్రీకరించి మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ మీద మొదట తిరుగుబాటు మొదలు పెట్టిందే ఖమ్మం రైతులు అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపింది కేసీఆర్‌ ప్రభుత్వమని, గులాబీ తెగులుతో మిర్చి రైతులు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంనీ కనీసం పరామర్శ లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పువ్వాడ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు.. కేసు పెట్టి మంత్రి పదవి నుండి తొలగించాల్సిన ది పోయి… పక్కనే పెట్టుకున్నారు.. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ కే అండగా ఉన్నారు.,9 సీట్లు గెలిచారు.. కానీ.. సన్నాసులు అమ్ముడు పోయారంటూ ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం మొత్తం మనదేనని, ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోట ఖమ్మం ఖిల్లా పై మూడు రంగుల జెండా ఎగుర్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే ప్రజలకు మేలు అని, రైతు డిక్లరేషన్ అమలు చేసి తీరుతామని ఆయన వెల్లడించారు. ధరణి పోర్టల్ తో ఊరి నిండా పంచాయితీలే.. హైదరాబాద్ లో హత్యలు కారణం ధరణి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి నీ… బంగాళ ఖాతం లో వేస్తామని ఆయన తెలిపారు.

 

Exit mobile version