రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతు బీరయ్య మృతి చెందాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు చేయ లేదన్న బాధతోనే రైతు మృతి చెందాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కలెక్టర్ల నివేదికలకు విలువ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన ప్రభు త్వం అది వదిలేసి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 40వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వాళ్లందరి హత్యలకు సీఎం కేసీఆరే కారణమన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచి రైతులు పండించిన ధాన్యానికి మద్ధతు ధర ఇచ్చి కొనాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు. పెట్రోల్, డీజీల్‌పై రాష్ట్ర ప్రభుత్వం పది రూపా యలు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన ధరలు తగ్గించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
