TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. కాంగ్రెస్ హర్షం
- తెలంగాణ మోడల్ పాలన ప్రభావం: మహేష్ గౌడ్
- కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
- విజయ్‌కు అభినందనలు.. ఇండియా కూటమి సమీక్ష త్వరలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) భారీ విజయం సాధించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టమని ఆయన కొనియాడారు. కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుపు వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేతల కృషి ఎంతో ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, కీలక నేతలు కేరళలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజా పాలనను చూసి ఓట్లు వేయాలని తాము కోరామని, ఆ ప్రభావం కేరళ ఓటర్లపై స్పష్టంగా కనిపించిందని ఆయన విశ్లేషించారు.
కేరళలో వచ్చిన ఈ ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త నమ్మకాన్ని నింపాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విజయం తమ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చిందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న ధీమా పెరిగిందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోవడం పార్టీ భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ఇదే క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ‘ఇండియా’ (INDIA) కూటమి త్వరలోనే సమీక్ష నిర్వహించబోతోందని ఆయన చెప్పారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని, కూటమిని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!