Site icon NTV Telugu

Revanth Reddy: పార్టీలో చేరేవారిపై టీఆర్ఎస్ కేసులు పెట్టి వేధిస్తోంది

Revanthreddy

Revanthreddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయ‌న మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామని తెలిపారు. అయితే..రానున్న కాలంలో పార్టీలో పెద్దఎత్తున చేరికలుంటాయని, ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా లంచ్ కు ఆహ్వానించారని, మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. కాగా.. త్వరలోనే హైదరాబాద్ లో విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సభ పెడతారని, దానికి పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఈనేప‌థ్యంలో.. ప్రశాంత్ కిషోర్, బీజేపీ ప్లాన్ లో భాగంగానే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు.

కాగా.. పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్రాన్ని తయారుచేయాలని పీకే ప్లాన్ చేస్తున్నాడని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఉండకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాగా.. వారి చర్యలకు విరుద్ధంగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ కూడా సభ పెడుతుందని..దానికి ఎంతమంది వస్తారో చూడాలని వ్యాఖ్యానించి రేవంత్‌ జులై 7కి తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుందని, ఈ ఏడాదిలో తాను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్ కు వివరించినట్లు తెలిపారు. ఈనేప‌థ్యంలో.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే.. ప్రస్తుతం అంతా సద్దుమణిగిందన్నారు. అంతేకాకుండా.. మోడీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించాం కానీ..అలా జరగలేదని, టీఆర్ఎస్, బీజేపి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొలేదని, రెండు ఒక్కటేనని విమర్శించారు.

Exit mobile version