పాలమూరు సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలమూరు సభలో రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించకుండా ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి గువ్వలోడు, గుడ్లగూబ లోడు ఎమ్మెల్యే లుగా భూ కబ్జాదారులు, ఇసుక దండాలు చేసేటోళ్లు పాలమూరు పరువు తీస్తున్నారని హాట్ కామెంట్లు చేసిన రేవంత్.. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టి కృష్ణ నీళ్లు దోచుకుపోతుంటే కడప జిల్లా ఇంచార్జి మంత్రిగా టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారని.. మంత్రి పదవికి ఆశపడి రాజశేఖర్ రెడ్డి వద్ద కాళ్లవద్ద పడి పడిగాపులు కాసిండ్రు అని విమర్శించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు నుంచే మొదలు పెడతామని.. బంజారా హిల్స్ లో తన ఇల్లు అమ్మి ఇక్కడ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తా అన్నారు.. కానీ, ఇప్పుడు పాలమూరులో సాగునీటి దోపిడీ జరుగుతుందన్నారు. ఇక్కడ పరిశ్రమలు రావడంలేదు.. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు.. మా పిల్లలు ఇంకా వలసలు పోవాల్సిందేనా.. బొంబాయిలో కంపెనీలలో పనిచేయాల్సిందేనా..? అంటూ ఫైర్ అయ్యారు రేవంత్‌రెడ్డి.. మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు బడిత పూజ చేస్తామని హెచ్చరించిన ఆయన.. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు.. కేసీఆర్ తెలంగాణ రాగానే పూర్తిచేసి ఉంటే ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్లు అవ్వి అక్రమ ప్రాజెక్టులు అనే వారు కాదు కదా? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి నేను అధ్యక్షున్ని అయినా నేను పాలమూరు బిడ్డనే అన్నారు రేవంత్‌రెడ్డి.. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని సీట్లు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. పోలీస్ లకు హెచ్చరిక చేస్తున్న.. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న వారిని వారి పేర్లు రాసి పెట్టుకుంటాం.. మేం అధికారంలోకి వచ్చాక.. .కేసీఆర్ ను పండపెట్టి తొక్కుతాం అటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!