కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్యాయం.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గుజ్జుల మహేష్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది.. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. ఏమీ చేయకుండా కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టారు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చిండు అంటూ కామెంట్ చేశారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు, గిరిజనులకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదన్న రేవంత్‌రెడ్డి.. ఫీజురీఎంబర్స్ మెంట్స్, ఆరోగ్య శ్రీ లేనే లేదన్నారు.. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి పిల్లలను చదివిస్తే ఉద్యోగాలు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. దళితులకు 3 ఎకరాలు రాలే, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ రాలె.. మహిళకు పావలా వడ్డీ రుణాలు రాలె, బడిపిల్లలకు పగటితొ బువ్వ కూడా బంద్ అయ్యిందన్నారు.. కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు తలొక్క ఫామ్‌హౌస్ వచ్చింది.. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులకు పదవులొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న కుటుంబాలను ఏమి రాలె.. కనీసం వాళ్లని పట్టించుకున్న పాపానపోలేదన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కల సాకారం కావాలంటే.. రాష్ట్రంలో.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. దానికోసం అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!