Site icon NTV Telugu

TPCC Mahesh Goud : దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు.అన్ని రకాలుగా సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలన్నీ పరిగణలోకి తీస్కొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఏకగ్రీవంగా బిల్లు చేయడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిల్లు కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, మంత్రి వర్గ ఉప సంఘానికి బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Re-shoot : ప్యాచ్ వర్క్ కోసం 15 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న స్టార్ హీరో

బీసీ వాటా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణ లో నెరవేర బోతున్నాయని ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు… ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సారధ్యంలో ఈ బిసి రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా తెలంగాణ నుబచే అడుగులు పడతాయని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా అమలు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు..

Telangana Assembly Session 2025 Live Updates : హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Exit mobile version