టి.పీసీసీ ప్రకటన.. సీనియర్, అధికార ప్రతినిధుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని, కమిటీలను ప్రకటించిన తర్వాత.. పార్టీలో కొత్త ఊపువచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఇక, టి.పీసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను నియమించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ మేరకు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పని విభజన కూడా చేసింది పీసీసీ.
పీసీసీ ప్రకటించిన సీనియర్ అధికార ప్రతినిధులు సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ, బెల్లయ్య నాయక్ ఆదివాసీ కాంగ్రేస్ జాతీయ నాయకులు, అద్దంకి దయాకర్ సీనియర్ నాయకులు, హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్, నేరేళ్ల శారద, మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉండగా.. అధికార ప్రతినిధులుగా 1. మానవతా రాయ్, 2. ఎండీ రియాజ్, 3. రవళి రెడ్డి, 4. కైలాష్ నేత, 5. రామచంద్రారెడ్డి, 6. కల్వ సుజాత, 7. సంకేపల్లి సుధీర్ రెడ్డి, 8. చారగొండ వెంకటేష్ ఉన్నారు.. ఇక, అయోధ్య రెడ్డి.. అధికార ప్రతినిధుల సమన్వయ కర్త.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాగా నియమించారు.. మరోవైపు సీనియర్ ఉపాధ్యక్షుల పని విభజన.. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే.. 1. సంబాని చంద్రశేఖర్ వరంగల్ మరియు భువనగిరి, 2. ఆర్.దామోదర్ రెడ్డి.. మెదక్ మరియు నిజామాబాద్, 3. మల్లు రవి.. మల్కాజిగిరి మరియు హైదరాబాద్, 4. సురేష్ కుమార్ షెట్కార్.. ఖమ్మం మరియు మెదక్, 5. వేం నరేందర్ రెడ్డి.. మహబూబ్ నగర్ మరియు చేవెళ్ల, 6. జి.నిరంజన్.. పెద్దపల్లి మరియు సికింద్రాబాద్, 7. కుమార్ రావ్.. ఖమ్మం మరియు నల్గొండ, 8. రమేష్ ముదిరాజ్.. నాగర్ కర్నూల్ మరియు జహీరాబాద్, 9. పొడెం వీరయ్య.. ఆదిలాబాద్, 10. జఫ్ఫార్ జవీద్.. అనుబంధ సంఘాల బాధ్యత అప్పగించింది. సీనియర్ ఉపాధ్యక్షులకు కేటాయించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలను ఆయా నియోజక వర్గాల కార్య నిర్వాహక అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది పీసీసీ.
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
తాజావార్తలు
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!