Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

మహిళా బిల్లు ఆమోదం.. హర్షం వ్యక్తం చేసిన మిల్కీ బ్యూటీ

నూతన పార్లమెంట్ భవనం సినీ తారలతో కళకళలాడింది. నేడు ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, దివ్య దత్తా భూమిక పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. ఇక వారందరిలో తమన్నా హైలైట్ గా నిలిచింది. రెడ్ కలర్ చీరలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అందంగా కనిపించింది. పార్లమెంట్ భవనం సందర్శనానంతరం ఆమె మహిళా బిల్లు ఆమోదంపై హర్షం వక్తం చేసింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు గురువారం రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టడం, ఆ తరువాత చర్చలు జరగడం.. చివరకు ఆ బిల్లుకు ఆమోదం తెలపడంతో అందరు హర్షం వ్యక్తం చేశారు.

కెనడా వేదికగా.. ఖలిస్తానీ ఉగ్రసంస్థలతో పాక్ ఐఎస్ఐ రహస్య సమావేశం..

భారతదేశాన్ని చికాకు పెట్టిందుకు, అస్థిర పరిచేందుకు దాయాది దేశం పాకిస్తాన్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. తాజాగా ఇండియా-కెనడాల మధ్య తీవ్రస్థాయిలో దౌత్యవివాదం చెలరేగుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించడం వివాదాస్పదం అయింది. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇదే విధంగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ గూఢాచర సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’ కెనడా వేదికగా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు, కీలక వ్యక్తులతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. కెనడాలోని వాంకోవర్ లో ఈ సమావేశం జరిగింది. భారతదేశానికి వ్యతిరేకంగా మరింత ప్రచారం చేసేలా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఖలిస్తానీ గ్రూపులకు ఎప్పటి నుంచో ఐఎస్ఐ ఫండింగ్ ఇస్తోంది.

ఇక్కడున్నది కాపు బిడ్డ.. బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్

ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘X’ వేదికగా ఆయన మండిపడ్డారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ! అంటూ వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ భయపెడితే తాను భయపడే రకం కాదని ఇందులోను మరీ స్పెషల్ గా తాను కాపు బిడ్డనంటూ చెప్పుకుంటూ వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేసిన విషయం తెలిసిందే.

వర్షాకాల సమావేశాల మొదటిరోజు వైసీపీ, టీడీపీ మధ్య సభలో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. బీఏసీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధం జరిగింది. దీంతో బాలకృష్ణ మీసం మెలేసి సవాల్ చేయగా, మంత్రి అంబటి అప్పుడే కౌంటర్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారని.. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని అంబటి హెచ్చరించారు. ఈ మీసాలు తిప్పడం సినిమాల్లో చేసుకోవాలన్నారు. దీంతో స‌భ‌లో ఒక‌సారిగా ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు స్టీల్ బ్యాంక్‌లు

ఫంక్షన్‌ హాళ్లలో వేడుకల సందర్భంగా ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలను కలుపుకొని స్టీల్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యే ఇతర కార్యక్రమాలలో వంట చేయడానికి, వడ్డించడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను అందించే టెంట్ హౌస్‌ల తరహాలో స్టీల్ బ్యాంక్‌లు పనిచేస్తాయి. పట్టణ పేదరిక నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఖమ్మం జిల్లా మునిసిపల్ ఏరియాలలో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

దారుణం.. కదులుతున్న కారులో బాలికపై అత్యాచారం..

ముంబైలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. కదులుతున్న టాక్సీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బాలిక తన కుటుంబ సభ్యులతో గొడవపడి, తన బంధువులను కలిసేందుకు మలాడ్ లోని మల్వాని వెళ్లాలని భావించింది. ఇదే సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై టాక్సీ డ్రైవర్ కన్నేశాడు. మల్వానిలో దించుతామని కారును దాదర్ వైపు పోనిచ్చి అక్కడ మరో నిందితుడు సల్మాన్ షేక్ ను ఎక్కించుకున్నాడు. ఇద్దరు నిందితులు బాలికపై ట్యాక్సీలోనే అత్యాచారం చేశారు. బాలిక అదృశ్యంపై కుటుంబ సభ్యులు మలబార్ హిల్ పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు బాలిక మలాడ్ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. బాలికను తీసుకురావడనికి ఒక టీమును మలాడ్ పంపారు. అయితే విచారణలో మలాడ్ వెళ్తున్న సమయంలో టాక్సీ డ్రైవర్, మరో వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది.

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత రేపు తీర్పు వెల్లడిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే.. హైకోర్టులో చంద్రబాబు తరపున లాయర్లు క్వాష్ పిటిషన్ వేయడం.. దానిపై తీర్పు పెండింగ్‌లో ఉండటంతో.. ఆ తీర్పు అంశంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాలు బలంగా తమ వాదనలు వినిపించాయి. ఇప్పుడు పిటిషన్‌పై తీర్పు వాయిదా పడటంతో అందరిలోను ఉత్కంఠ కనిపిస్తోంది. ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి రేపు రావొచ్చు లేదా సోమవారం నాటికి రావొచ్చునని న్యాయనిపుణులు చెబుతున్నారు.

డెవిల్ తో లియో పోరాటం.. విజయ్ నట విశ్వరూపం

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక కొన్నిరోజులుగా మేకర్స్ లియో పోస్టర్స్ ఫీస్ట్ ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మూడు రోజుల క్రితం లియో తెలుగు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా హిందీ పోస్టర్ ను రిలీజ్ చేసి.. సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ను దించి దిమ్మ తిరిగేలా చేస్తున్నాడు లోకేష్. మొదటి నుంచి కూడా లోకేష్ సినిమాల్లో స్టార్ క్యాస్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.

5000 వేల మొక్కలతో పూజలందుకుంటున్న గ్రీన్ గణేష్.. ఎక్కడో తెలుసా..?

గణేష్‌ నవరాత్రోత్సావలు వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా తేడాలేకుండా.. అందరూ సంతోషంగా జరుపుకుంటారు. అయితే.. వివిధ ప్రత్యేక ఆకర్షణలతో ఘననాథుడిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తుంటారు. అయితే.. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వినూత్న రీతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు కొందరు. అయితే.. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ నాగోల్ లో 5000 వేల మొక్కలతో పూజలందుకుంటోంది 20అడుగుల గ్రీన్ గణేష్ విగ్రహం.

ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా గ్రీన్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నాగోల్ లో 5000 వేల మొక్కలతో గ్రీన్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రీన్ గణేశునికి తొమ్మిది రోజులు పాటు హాట్టహసంగా పూజలు జరుగుతున్నాయి. గ్రీన్ గణేష్ నీ దర్శించుకునే ప్రతి భక్తుడికి ప్రసాదంగా ఒక మొక్క ను నిర్వాహకులు ఇస్తున్నారు. నిమజ్జనం రోజు పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహం లోని మొక్కలను భక్తులకు పంచాలని, ఇండియాలోని అందరూ మొక్కలు పెంచి పచ్చదనంతో ఆరోగ్యమైన గాలి పీల్చుకుని ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా ఆ గణేశుని ఆశీస్సులు మన అందరిపైనా ఉండాలి అని కోరుకుంటున్నాము అని నిర్వాహకులు తెలిపారు

విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దాలా రాజీనామా..

భారత ఐటీ దిగ్గజం విప్రోలో కీలక ఉద్యోగి రాజీనామా చేశారు. రెండు దశాబ్ధాలుగా సంస్థలో పనిచేస్తున్న ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్ జతిన్ దలాల్ రాజీనామా చేసినట్లు గురువారం తెలిపింది. కంపెనీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న అపర్ణా అయ్యర్, దలాల్ స్థానంలో సెప్టెంబర్ 22 నుంచి నియమితులవుతారని విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఇతర అవకాశాల కోసం జతిన్ దలాల్ రాజీనామా చేసినట్లు విప్రో తెలిపింది. గత కొన్ని ఏళ్లుగా మా ఫైనాన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో అపర్ణ అంతర్భాగంగా ఉంది. మా ఆర్థిక వ్యూహాలు, ప్రణాళిక, పెట్టుబడి కార్యక్రమాలు, ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తుందని విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే ఒక ప్రకటనలో తెలిపారు. దలాల్ 2002లో విప్రోలో చేరారు, ఆ తరువాత 2015లో ప్రెసిడెంట్, సీఎఫ్ఓ అయ్యారు. నవంబర్ 30న కంపెనీ నుంచి వెళ్లిపోనున్నారు.

ఆ కేసులో హీరో మోహన్ లాల్ కు ఊరట..

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ నివాసంపై 2011 లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో కేరళ అటవీ మరియు వన్యప్రాణి విభాగం అటవీ చట్టం కింద మోహన్‌లాల్‌పై కేసును నమోదు చేసింది. ఆ తర్వాత 2019లో, ఎర్నాకులంలోని మెక్కప్పల్ ఫారెస్ట్ స్టేషన్ కూడా మోహన్‌లాల్‌ పై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేస్ పెరంబూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.దీంతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు తమను అభియోగాల నుంచి విముక్తి చేయాలని సమర్పించిన పిటిషన్లను విచారణకు అంగీకరించింది.దీనితో ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది.

రంగారెడ్డి జిల్లాలో గోదాంల నిర్మాణానికి 38 కోట్లు అందించాం

వికారాబాద్ జిల్లా కోటపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఇచ్చిన 6 గ్యారంటీ డిక్లరేషన్ లను కర్ణాటకలో ముందు అమలు చేయాలన్నారు. కర్ణాటకలో రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతులకు కరెంటు లేదని, తెలంగాణలో ప్రజలను, రైతులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మహేందర్ రెడ్డి మండిపడ్డారు.

రాహుల్ గాంధీకి ట్యూటర్లు సాయం చేయరు.. జేపీ నడ్డా ఫైర్..

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఓబీసీ కోటాపై వ్యాఖ్యలు చేశారు. దీనికి బదులుగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ట్యూటర్లు(బోధకులు) కూడా రాహుల్ గాంధీకి సాయం చేయరని అన్నారు. గురువారం రాజ్యసభలో నడ్డా మాట్లాడుతూ.. ‘‘నాయకుడు నాయకుడిగా ఉండాలి, ట్యూటర్లు సాయం చేయరు, ట్యూటర్ల స్టేట్మెంట్లు పనిచేయవు’’ అని అన్నారు.

బుధవారం రాహుల్ గాంధీ పార్లమెంట్ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాకు డిమాండ్ చేశారు. కులగణన వివరాలను కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యదర్శులు 90 మంది ఉంటే వారిలో ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారున్నారని వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!

సొంతగడ్డపై అక్టోబర్ లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే ఆసియా కప్ 2023 గెలిచి మంచి జోరుమీదున్న భారత్.. ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే వరల్డ్ కప్ కు ముందు భారత్.. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. 27 వరకు జరగనుంది. అయితే ఈ సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు.

 

 

Exit mobile version