NTV Telugu Site icon

Top Headlines @ 9AM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం.

తిరుమలలో భక్తుల రద్దీ శనివారం నాడు మరింత పెరిగింది. ముఖ్యంగా వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రాక భారీగా ఉంది. ఇక శనివారం నాడు తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి. శనివారం నాడు శ్రీవారిని 74,467 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 40005 మంది భక్తులు తలనీలాలు సంపర్పించారు. ఇక శనివారం నాడు స్వామి వారి హుండీ ఆదాయం 3.77 కోట్లుగా తేలింది. ఇక క్యూ కాంప్లేక్స్ లో కంపార్టుమెంట్లలలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు పాలు, అల్పహారం లాంటి వాటిని అందిస్తూనే ఉన్నారు. సామాన్య భక్తుల శ్రీవారి దర్శనం కల్పించేందుకు కోసం జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారంలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీఐపీ నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలను కూడా స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేసింది.

మున్సిపల్ చైర్ పర్సన్ పై అట్రాసిటీ కేసు నమోదు..

నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా పై అట్రాసిటీ కేసును త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. 29 వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో టీడీపీ నేతలు, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా తనను కులం పేరిట టీడీపీ పార్టీకి చెందిన నేత తిమ్మయ్యను చైర్ పర్సన్ మాబున్నిసా దూషించారని ఫిర్యాదు చేసారు. ఇందులో భాగంగా తిమ్మయ్య ఫిర్యాదు మేరకు చైర్పర్సన్ తో పాటు ఆమె భర్త జీలాని, మరో ఇద్దరిపై అట్రాసిటి కేసు నమోదు చేసారు. ఈ విషయం సంబంధించి టీడీపీ, వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ సమయంలో ఇరుపార్టీ నాయకులు దుర్భాషలకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల వారికి సర్ది చెప్పి చివరికి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వార్డు సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచే నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది.

నంద్యాల – గిద్దలూరు ఘాట్ రోడ్డులో చిరుత హల్చల్..

నంద్యాల జిల్లాలోని నల్లమలలో చిరుతల కలకలం సృష్టించింది. నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్ల గ్రామం వద్ద చిరుత సంచారం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నిద్రపోతున్న దినసరి కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. దింతో ఆమెకు తలకు తీవ్ర గాయాలయాయ్యి. దాడి జరుగుతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కర్రలతో తరమడంతో చిరుత అక్కడి నుండి పరారైంది. మే నెలలో కూడా టోల్ గేట్ వద్ద వాచ్ మెన్ భాష పై దాడికి పాల్పడింది చిరుత. ఇక ఆ చిరుతను పట్టుకోవడానికి రెండు బోన్లను అటవీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. పచర్ల గ్రామం అభయారణ్యంలో ఉండడంతో ఇలా అనేకసార్లు క్రూర మృగాలు గ్రామంలోకి వచ్చి అనేకమార్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

థాయిలాండ్ లో దేవర రొమాంటిక్ డ్యూయెట్ ..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు. “ఫియర్ సాంగ్” పేరుతో రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.రీసెంట్ గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెళ్లారు.అక్కడ దేవర రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.ఎన్టీఆర్ ఆ సాంగ్ షూట్ లో పాల్గొంటూనే ఫ్యామిలీతో థాయిలాండ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

హిజ్రాల ఆగడాలపై పోలీసులు కొరడా..

హైదరాబాద్ మహానగరంలో హిజ్రాల ఆగడాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నగరంలో పలు సిగ్నళ్ల వద్ద హిజ్రాలు వసూళ్లకు పాల్పడుతున్నారు. మాదాపూర్, కేబీఆర్ , ఐకియా షోరూం, పలు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు ఆగడంతో హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. రెడ్ సిగ్నల్ పడితే చాలు వాహనాలు ఆగడంతో హిజ్రాలు చప్పట్లు కొడుతూ.. డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ జేబీలలో చేతులు వేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా హిజ్రా ఆగడాలు ఆగడం లేదని తెలుపుతున్నారు. ఇలాగే వసూళ్లు కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని ప్రయాణికులు చెబతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్దనే కాదు మెట్రో స్టేషన్ల వద్దకూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుందని పేర్కొన్నారు.

కల్కి రిలీజ్ ట్రైలర్ అదిరింది.. కానీ అదొక్కటే మైనస్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా  తెరకెక్కించాడు.ఇండియన్ మైథలాజి కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.రీసెంట్ గా ఈ చిత్రం నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ఎంతో రిచ్ గా తెరకెక్కించారు.ఫస్ట్ ట్రైలర్ తోనే మెప్పించిన నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ఓకే చెప్పిన నేషనల్ క్రష్..?

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది.గత ఏడాది ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది.ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ “సికిందర్” అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న “NTR31 ” మూవీలో రష్మిక ఎంపికైనట్లు సమాచారం.తాజాగా ఈ ఆఫర్ కు రష్మిక ఓకే చెప్పినట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది.

మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి

మూసీ అభివృద్ధి పథకానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్రం తరపున పలు అంశాలను ప్రస్తావించారు. తొలిసారిగా కేంద్ర బడ్జెట్ తయారీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల బకాయిలు ఇవ్వడంతో పాటు మరో ఐదేళ్లు కొనసాగించాలని, జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమయంలో రుణ పరిమితి సీలింగ్‌ను ఖరారు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం అందుతుందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి కొన్ని అంశాలను స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు.

బీజేపీ పాలనలో విద్యార్థులకు పోరాటాలకు బలవుతున్నారు : రాహుల్ గాంధీ

నీట్-పీజీ పరీక్ష వాయిదా తర్వాత శనివారం ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల అసమర్థత వల్ల పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. నీట్-యుజి పరీక్షకు సంబంధించిన వివాదాల మధ్య, నీట్-పిజి పరీక్షను వాయిదా వేసినట్లు, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇప్పుడు నీట్ పీజీ కూడా వాయిదా పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాశారు.. నరేంద్ర మోడీ పాలనలో విద్యావ్యవస్థ ధ్వంసమైందనడానికి ఇది మరో దౌర్భాగ్య ఉదాహరణ. బిజెపి పాలనలో విద్యార్థులు తమ కెరీర్‌ కోసం చదువుకోలేదని, భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 39 మంది మృతి

గాజాలో శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 39 మంది మరణించారు. పాలస్తీనా ఆసుపత్రి అధికారులు ఈ సమాచారాన్ని అందించారు. గాజా నగరంలోని అల్-అహ్లీ హాస్పిటల్ డైరెక్టర్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి 36కు పైగా మృతదేహాలు వచ్చాయని చెప్పారు. గాజాలోని తూర్పు ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడికి గురైన భవనం నుండి దాదాపు అదే సంఖ్యలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గాజాలో ఉన్న పాలస్తీనియన్ సివిల్ డిఫెన్స్ అనే అత్యవసర బృందం తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం రఫా నగరం ఉత్తర భాగంలో వలన వచ్చిన పాలస్తీనియన్ల కోసం నిర్మించిన శిబిరాలపై దాడి చేశాయి, కనీసం 25 మంది మరణించారు.. 50 మంది గాయపడ్డారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అత్యవసర కార్మికులు ఈ సమాచారాన్ని అందించారు.
Hyderabad Hijras: హిజ్రాల ఆగడాలపై పోలీసులు కొరడా.. బలవంతపు వసూళ్లపై కఠిన చర్యలు