Hyderabad Hijras:హైదరాబాద్ మహానగరంలో హిజ్రాల ఆగడాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నగరంలో పలు సిగ్నళ్ల వద్ద హిజ్రాలు వసూళ్లకు పాల్పడుతున్నారు. మాదాపూర్, కేబీఆర్ , ఐకియా షోరూం, పలు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు ఆగడంతో హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. రెడ్ సిగ్నల్ పడితే చాలు వాహనాలు ఆగడంతో హిజ్రాలు చప్పట్లు కొడుతూ.. డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ జేబీలలో చేతులు వేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా హిజ్రా ఆగడాలు ఆగడం లేదని తెలుపుతున్నారు. ఇలాగే వసూళ్లు కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని ప్రయాణికులు చెబతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్దనే కాదు మెట్రో స్టేషన్ల వద్దకూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుందని పేర్కొన్నారు.
Read also: Israel Bombed Gaza : గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 39 మంది మృతి
ముఖ్యంగా హైటెక్ సిటీ, మైత్రివనం, ఎల్బీనగర్, మాధాపూర్, దిల్ షుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కూడళ్ల వద్ద హిజ్రాలు బలవంతపు వసూళ్లకు తెగ పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్ వద్ద నిలబడిన వారిపై హిజ్రాలు డబ్బులు అడిగిన స్థానికులు లేదని సమాధానం చెప్పిన వినకుండా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ భీష్మించుకుని కూర్చుంటారు. దీంతో గతిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు డబబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇయితే అందరూ హిజ్రాలు బలవంతపు వసూళ్లు చేయడంలేదని, కొందరు ఈపనిని పనిగట్టుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. హిజ్రాలు దీవిస్తే మంచిది.. అంతే గానీ జేబులు ఖాళీగా వున్నా కూడా కొందరు హిజ్రాల వేశధారణ ధరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇది నిజమైన హిజ్రాలకు మాయని మచ్చలా మారుతుందని ప్రయాణికులు చెబుతున్నారు.
Read also: Tirumala Darshan : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం..
ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు. హిజ్రాల వేషధారణలో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. పలువురి ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. వాహనదారుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్న ఏడుగురు హిజ్రాలను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. నిత్యం వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు ఏడుగురు హిజ్రాలను శేరిలింగంపల్లి తహసీల్దార్ ముందు హాజరుపరిచారు. అనంతరం బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దని తహసీల్దార్ మందలించారు. వారిని మంచి పరివర్తనతో ఉండాలని హెచ్చరించి వదిలి వేశారు. కాగా.. ఇక నుంచి ఎవరు బలవంతపు వసూళ్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Leopard Hunting : నంద్యాల – గిద్దలూరు ఘాట్ రోడ్డులో చిరుత హల్చల్..