Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

లేడీస్‌ కోసం స్పెషల్ బస్‌.. టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌

అమ్మాయి బస్సు జర్నీ చేయాలంటే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే కొందరు ఆకతాయిలు అమ్మాయిలను ఆటపట్టిస్తూ.. వెకరి చేష్టలు చేస్తూ వారితో మిస్ బిహేవ్ చేస్తుంటారు. అంతేకాకుండా బస్సులో సీటు దొరక్క స్టాండింగ్ లో వుంటే ఇక చెప్పనక్కర్లేదు.. వెనుక నుంచి అమ్మాయిలను పట్టుకోవడం, చేతులు తాకడం వంటివి చేస్తుంటారు. ఇక సీటులో కూర్చున్న కూడా మహిళలకు సతాయిస్తూ టీజింగ్ చేస్తుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీస్ శుభవార్త చెప్పింది. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది.

అమ్మాయిలకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని విధాలా కృషి చేస్తున్న టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే పలు సేవలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును ఏర్పాటు చేసింది. ఈ మహిళా ప్రత్యేక బస్సు JNTU నుండి వేవ్ రాక్ మార్గంలో ఉదయం మరియు సాయంత్రం నడుస్తుంది. ఈ నెల 31 నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో మహిళలు పడుతున్న ప్రయాణ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రత్యేక బస్సును అందుబాటులోకి తెస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

బాణసంచా గోదాములో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి, 20 మందికిపైగా గాయాలు

తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పాతపేటలోని ఓ బాణాసంచా గోడౌన్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాణాసంచా గోడౌన్‌ కావడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి భారీగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల అదుపులోకి తెచ్చుందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి విషాదాన్ని మిగిల్చాయి. శనివారం ఉదయాన్నే ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఘటనా ప్రాంతంలో క్షతగాత్రుల హాహాకారాలు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు మొదలయ్యాయి. ఈ పేలుళ్లలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక, వైద్య సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

పవన్ కల్యాణ్‌ది శునకానందం.. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం

బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమాను నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను.. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కల్యాణ్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.. ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తాను నటిస్తూ.. నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడని మండిపడ్డారు. కానీ, నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయను.. పవన్ కళ్యాణ్ ది శునకానందం అంటూ దుయ్యబట్టారు. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం.. ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన ఆనందంగా పేర్కొన్న ఆయన.. నా డ్యాన్స్ సింక్ అవ్వలేదట.. నేను ఏమైనా డ్యాన్స్ మాస్టర్ నా? అంటూ నిలదీశారు. అయితే, పవన్ కల్యాణ్‌ రాజకీయాలకు సింక్ అవ్వడంటూ దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు.

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ చర్యలు

మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, క్రూరంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లను మధ్యప్రదేశ్‌లో అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు రవీంద్ర చౌదరి, అతుల్ బధౌలియాగా గుర్తించబడ్డారు. వారు సత్నా జిల్లాలోని మైహార్ పట్టణంలోని ప్రసిద్ధ దేవాలయాన్ని నిర్వహించే ట్రస్ట్‌లో రోజువారీ వేతన ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. అత్యాచార ఘటన తెరపైకి రావడంతో ఇద్దరినీ ఉద్యోగాల నుంచి కమిటీ తొలగించింది. రాష్ట్రంలోని విదిశా జిల్లాలోని ఉదయ్‌పూర్‌లో రవీంద్ర ఇల్లు నేలమట్టం కాగా, న్యూ బస్తీలోని మలియన్ తోలాలో అతుల్ ఇల్లును కూడా అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. కూల్చివేత పనులు జరుగుతున్నందున ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగిపోతే పట్టించుకోవా..

తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ ప్రజల గురుంచి పటించుకోవాలి.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగి పోతే పట్టించుకోవా అని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ఖర్చు ఎంత, లాభం ఎంత, సమ్మక్క బ్యారేజ్ వల్ల లాభం ఎంత, ఖర్చు ఎంత అనే దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. ఇపుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. జీహెచ్ఎంతో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికే బీజేపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఎంత కష్టబడ్డ జల్లెడలో నీరు పోసినట్టే.. నెలలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఖాళీ చేస్తాడు అని బీజేపీ నేత ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు కోరుతున్న బీజేపీలో చేరండి.. ప్రగతి భవన్ లో మొదటి రోజు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. నెక్స్ట్ డే నుంచి నో ఎంట్రీ అనే బోర్డు కనిపిస్తుందన్నాడు.

సీఎం జగన్ పేదల వైపు ఉంటే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు ఉన్నారు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. కుప్పంలో తనను పెద్దిరెడ్డి ఓడిస్తాడని చంద్రబాబు భయపడుతున్నాడు అని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, అవమానాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు అని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు అన్ని రకాలుగాను మోసం చేశాడు.. సీఎం జగన్ ప్రభుత్వంలో మా వర్గాలన్నీ సంతోషంగా, గౌరవంగా ఉన్నాయని ఆయన కామెంట్స్ చేశారు. ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ పార్టీకి లేదు అంటూ ఎంపీ నందిగం సురేష్ చెప్పారు.

ఈ విపత్తు విషయంలో ప్రభుత్వం తీరు దారుణం…

రాష్ట్రంలో ఉన్న విపత్తుపై రెండు కమిటీలు ఏర్పాటు చేసామని, ఒక కమిటీ అన్నీ ప్రాంతాలతో సమన్వయం చేయడానికి, రెండవది పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షించడానికి అని ఆయన అన్నారు. ఈ విపత్తు విషయంలో ప్రభుత్వం తీరు దారుణమని, పంట నష్టాన్ని అంచనావేసి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు కూడా చెప్పినా.. ప్రభుత్వ నుండి ఎలాంటి స్పందన లేదన్నారు కోదండరెడ్డి. కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యవసాయశాఖా మంత్రికి వినతిపత్రం ఇచ్చామని, రాష్ట్రం అతలాకుతలం అయిందన్నారు కోదండరెడ్డి. స్కూళ్లకు సెలవులు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అందడంలేదని కమిటీ గుర్తించిందన్నారు. ఉచిత మందులు పంపిణీ చేసి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని కమిటీ కోరుతుందని, జిల్లాల వారిగా రివ్యూ నిర్వహించి జరిగిన నష్టాన్ని సేకరిస్తామన్నారు కోదండ రెడ్డి. కేంద్రానికి దరఖాస్తు కూడా పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని కోరుతున్నామన్నారు.

మణిపూర్‌కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీల బృందం హింసాత్మక మణిపూర్‌కు చేరుకుంది. హింసాత్మకంగా దెబ్బతిన్న రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను నేతలు అంచనా వేయనున్నారు. 20 మంది నేతల బృందంలో కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, ఫూలో దేవి నేతమ్, కె సురేష్, సుస్మితా దేవ్(తృణమూల్ కాంగ్రెస్), సుశీల్ గుప్తా(ఆప్ ), శివసేన (యూబీటీ) నుంచి అరవింద్ సావంత్, కనిమొళి కరుణానిధి(డీఎంకే), జేడీయూ నాయకులు రాజీవ్ రంజన్ సింగ్, అనీల్ ప్రసాద్ హెగ్డే, సంతోష్ కుమార్ (సీపీఐ), ఏఏ రహీమ్ (CPIM), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), జావేద్ అలీ ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ), మహువా మాజి (జేఎంఎం), పీపీ మహమ్మద్ ఫైజల్ (ఎన్సీపీ), ఈటీ మహమ్మద్ బషీర్ (IUML), ఎన్‌కే ప్రేమచంద్రన్ (RSP), డీ రవికుమార్ (VCK), తిరు తోల్ తిరుమావళవన్ (VCK), ), జయంత్ సింగ్ (RLD)లు మణిపూర్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు.

ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రాసిన ‘మెమోరీస్ నెవర్ డై’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రామేశ్వరంలో ఆవిష్కరించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్‌ షా రామనాథస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ పుస్తకాన్ని ఏపీజేఎం నసీమా మరైక్యార్, శాస్త్రవేత్త వైఎస్ రాజన్‌లు రచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌, తమిళనాడు బీజేపీ చీఫ్‌ కె. అన్నామలై పాల్గొన్నారు. “ప్రధాని మోడీ నాయకత్వంలో మన విద్యార్థులకు, వారి స్టార్టప్‌లకు అంతరిక్ష శాస్త్రంలో అవకాశాలు తెరుచుకున్నాయి. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి అబ్దుల్ కలాం కల ప్రధాని కొత్త ఆవిష్కరణల వల్ల నెరవేరుతుందని నమ్ముతున్నాను.’ అని పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్‌ షా అన్నారు.

నాలాంటి సామాన్య కార్యకర్తకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు గర్వంగా ఉంది

తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు పదోన్నతి లభించింది. బీజేపీ అధిష్టానం ఆయనకు కీలక పదవిని కట్టబెట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఏపీ బీజేపీ నేత సత్య కుమార్ కు జాతీయ కార్య దర్శిగా ఛాన్స్ ఇస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన పదవిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం లేదా జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా పంపడం ద్వారా కేంద్ర నాయకత్వం బండి సంజయ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు అరెస్ట్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్‌లోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. శుక్రవారం రాత్రి నోయిడాలో ఒక కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆయన భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గవర్నర్ కాన్వాయ్‌ను ఢీకొట్టినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడించారు.

వేగంగా వచ్చిన వాహనం గవర్నర్ కాన్వాయ్‌ను రెండుసార్లు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి నల్లటి స్కార్పియో కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఘజియాబాద్‌కు చెందిన గౌరవ్ సోలంకి, మోను కుమార్‌లుగా గుర్తించారు.

 

 

Exit mobile version