NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు..

మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పని చేస్తోందని అన్నారు. రేవంత్ సీఎం కావడం మోడీ చాయిసే అన్నారు. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో రాహుల్ , రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెస్ ఏ.. బీజేపీ లో విలీనమౌతుందన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికయినా మోడీ , రాహుల్ కి ప్రత్యామ్నాయం కేసీఆర్ ఏ.. అన్నారు.

వైసీపీకి మరో బిగ్‌షాక్‌..? రాజీనామాకు సిద్ధమైన ఎంపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు పార్టీకి దూరంగా జరిగారు.. కొందరు పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తు్న్నారు.. మరోవైపు.. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు.. కార్పొరేటర్లు.. కౌన్సిలర్లు.. ఇలా ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు.. అయితే, ఇప్పుడు వైసీపీకి బిగ్‌ షాక్‌ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. దీనిపై రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’కు పదేళ్లు.. 53 కోట్ల ఖాతాల్లో రూ. 2లక్షల కోట్లు

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన(PMJDY) నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే ఈ పథకం కింద ఇప్పటివరకు తెరిచిన ఖాతాల సంఖ్యను సోషల్ మీడియాలో దేశప్రజలకు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో 53 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని, వాటిలో 2 లక్షల 31 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రధాని చెప్పారు.

ఈ రోజు మనం ఒక ప్రత్యేక సందర్భాన్ని జరుపుకుంటున్నాము – #10YearsOfJanDhan అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో రాశారు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు. జన్ ధన్ యోజన ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం జాతికి అంకితం చేశారు. దీని ద్వారా కోట్లాది ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువత, సమాజంలోని అట్టడుగు వర్గాలకు గౌరవం కలిగింది.

రాకెట్ వేగంతో దూసుకుపోతున్న NBCC షేర్

ఓ ప్రభుత్వ సంస్థ ఇప్పుడు బోనస్ షేర్లను పంపిణీ చేయనుంది. ఆగస్టు 31న జరిగే సమావేశంలో బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ మంగళవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బిసిసి (ఇండియా) లిమిటెడ్ స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో.. క్యాపిటలైజేషన్ ద్వారా తగినదిగా భావించినందున, ఆ నిష్పత్తిలో కంపెనీ ఈక్విటీ వాటాదారులకు బోనస్ షేర్లను జారీ చేసే ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తుందని పేర్కొందని పేర్కొంది. ఈ ప్రతిపాదన వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది.

NBCC తన వాటాదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రూ. 0.63 తుది డివిడెండ్‌ను జారీ చేయడానికి సిద్ధమవుతోంది. గత వారం జరిగిన సమావేశంలో షేర్ హోల్డర్ల అర్హతను నిర్ణయించేందుకు కంపెనీ సెప్టెంబర్ 6ను రికార్డు తేదీగా నిర్ణయించింది. దీనికి ముందు, కంపెనీ తన వాటాదారులకు సెప్టెంబర్ 2023లో డివిడెండ్ జారీ చేసింది. కాగా, మంగళవారం ఎన్‌బిసిసి షేర్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఈ షేరు దాదాపు ఒక శాతం లాభంతో రూ.177.45 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.31,999 కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఆగస్టు 31న కంపెనీ బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు కంపెనీ షేర్ ధర దాదాపు రూ.200దాటింది.

‘హైడ్రా’ పరిధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

‘హైడ్రా’ హైదరాబాద్ వరకే పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం అన్నారు. ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యమని తెలిపారు. చెరువులు కబ్జా చేసిన ఎవర్ని వదిలి పెట్టమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీ లు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయన్నారు. జంట జలాశయాలను పరిరక్షించడమే మా భాద్యత అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నా కుటుంబ సభ్యులు, బంధువు లు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివేస్తా అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌజ్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా? అని ప్రశ్నించారు. చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా తీసుకుంటాడన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు.

వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం

చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై హరీష్ రావుతో ఓ కమిటీ వేద్దాం.. అక్రమ నిర్మాణాలు దగ్గర ఉండి కూల్చివేద్దామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేము చేస్తున్న మంచి పనులు చూసి పార్టీలోకి వస్తాం అంటున్నారు. భయపెట్టి, బ్రతినిలాడి ఎవర్నీ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో కేస్ బై కేస్ విచారణకు సీబీఐకి అనుమతి ఇచ్చామన్నారు. వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన తెలిపారు. 111జీవో గత ప్రభుత్వం ఎత్తివేయ లేదు. ఆ జీవో అలానే ఉంది. ఆ జీవో రద్దు చేయాలంటే సుప్రీంకోర్టు, ఎన్జీటిల అనుమతి ఉండాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సుంకిశాలపై విచారణ జరుగుతుందని, 16 నెలలు జైల్లో ఉన్న సోసిడియా, ఇంకా జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఐదు నెలలు జైల్లో ఉన్న కవితకు బెయిల్ ఎలా వచ్చింది? అని ఆయన అన్నారు.

2 లక్షల పైన రుణాలు ఉన్నవారికి మార్గదర్శకాలు వస్తున్నాయి..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్‌ వేములవాడ లో 300 MTS గోదాం, Kdccb వేములవాడ శాఖ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. 2009 లో కరీంనగర్ ఎమ్మెల్యే కావాలని అనుకున్న వైఎస్ఆర్ ఎంపీగా పోటీ చేయాలని అన్నారని, కరీంనగర్ ఎంపీగా గెలిచా అని, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ సాధనలో మీ బిడ్డగా నా పాత్ర నిర్వహించానన్నారు. గంభీరావు పేట నుండి ఎల్కతుర్తి వరకు పాదయాత్ర చేశా ఎంపీ అయి కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కావాలని అనుకున్నానని, హుస్నాబాద్ ఎమ్మెల్యే అయి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర మంత్రి అయ్యానన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల బిడ్డగా మీకు ఏ ఇబ్బంది ఉన్న మీకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.

ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా చెడ్డ పేరు.. సీఎం కీలక వ్యాఖ్యలు

కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్‌ అవాస్తవాలు, తప్పుడు వాగ్దానాలే కారణం

రైతులను అయోమయానికి గురిచేస్తూ రుణమాఫీ అమలుపై మంత్రులు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలను ఎత్తిచూపుతూ, రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్‌ అవాస్తవాలు, తప్పుడు వాగ్దానాలే కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు బుధవారం అన్నారు. రైతులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మొత్తం రూ.31000 కేటాయించి రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి ప్రకటించగా, ఆగస్టు 15లోగా మాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని మరో మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి మాటను ఖండిస్తూ ఆర్థిక మంత్రి ఇప్పటి వరకు రూ.7500 కోట్లు మాత్రమే విడుదల చేశారని వెల్లడించారు.

మర్రి రాజశేఖర్‌ రెడ్డి కాలజీలకు నోటీసులు

అనధికార నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధికారులు బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన దామరచెరువు చెరువులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లో రెండు కళాశాలలు అక్రమంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు తాజాగా హైడ్రా నోటీసులు పంపింది.