NTV Telugu Site icon

ORR: షాకింగ్.. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ ఛార్జీల పెంపు

Orr

Orr

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ ఛార్జీల పెంచారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌ ఛార్జీలు రేపటి నుంచి పెరిగిన అమలులోకి రానున్నాయి. ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థ ఓఆర్‌ఆర్‌పై టోల్‌ వసూళు చేస్తోంది. కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వెహికిల్స్‌కు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచారు. పెరగక ముందు కారు, జీపు, లైట్‌ వెహికిల్‌కు కి.మీ. రూ .2.34 ఉండగా.. ఇప్పుడు రూ.2.44కు చేరింది. మినీబస్‌, ఎల్‌సీవీ వాహనాలకు కిలోమీటర్‌కు 20పైసలు పెంచారు. మినీబస్‌, ఎల్‌సీవీ వాహనాలకు కి.మీ. రూ.3.77 నుంచి రూ.3.94కు చేరుకుంది. బస్సు, 2 యాక్సిల్‌ బస్సులకు కి.మీ.రూ.6.69 నుంచి రూ. 7కు పెరిగింది. భారీ వాహనాలకు కి. మీ 70 పైసలు పెంచగా.. కి.మీకి రూ. 15.09 నుంచి రూ. 15.78కు చేరింది.

READ MORE: SRH-HCA: ఎస్‌ఆర్‌హెచ్‌, హెచ్‌సీఏ మధ్య ముదురుతున్న వివాదం.. జోక్యం చేసుకోవాలని బీసీసీఐకి రిక్వెస్ట్‌!

మరోవైపు.. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ రూట్ లో వెళ్లే వాహనాలకు టోల్‌ ఛార్జీలను తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్‌ చార్జీలు సోమవారం అర్ధరాత్రి ( మార్చ్ 31) నుంచి అమలులోకి రాబోతున్నాయి. తగ్గిన చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీ 2025 నుంచి మార్చి 31వ తేదీ 2026 వరకు అమలులో ఉంటాయి. ఇక, హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేపై తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌గేట్లు ఉన్నాయి.

READ MORE: HCU: 1973 లో 2300 ఎకరాల్లో హెచ్‌సీయూ ఏర్పాటు.. ఆ 400 ఎకరాలు ఎవరిది?