Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్.. కన్హా శాంతివనం సందర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో ఇవాల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
Read also: Supreme Court: నేడు ఈవీఎం- వీవీప్యాట్ ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
నేడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు రోడ్ల మరమ్మతులు చేపట్టారు. నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గొల్లపల్లి టోల్‌గేట్ వయా పెద్దగోల్కొండ మీదుగా ఇండియన్ బేకరీ (తొండుపల్లి), బుర్జుగడ్డ వద్ద యూటర్న్ తీసుకొని ముచ్చింతల్, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్, తిమ్మాపూర్, షాద్‌నగర్ మీదుగా మళ్లిస్తారు.
Read also: Lakshmi Stotram: సకల సంపదలు చేకూరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
అలాగే, గచ్చిబౌలి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పెద్దగోల్కొండ టోల్‌గేట్, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్, తిమ్మాపూర్, షాద్‌నగర్ మీదుగా మళ్లీంచనున్నారు. షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ట్రాఫిక్‌తోపాటు పెంజర్ల ఎక్స్‌రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అమీర్‌పేట్ మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు నుంచి పెద్దగోల్కొండ టోల్‌గేట్, శంషాబాద్, హైదరాబాద్ వైపు మళ్లిస్తారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.
Sri Mahalakshmi Stotram: లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ స్తోత్రాలు తప్పనిసరిగా వినండి
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!