NTV Telugu Site icon

CM KCR: నేటి నుంచి కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభ.. ఈరోజు ఎక్కడంటే..

Cm Kcr

Cm Kcr

CM KCR: రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా మళ్లీ నేటి నుంచి ప్రచారానికి రెడీ కానున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కొద్దిగా స్పీడ్ పెంచనున్నారు. ప్రతి రోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ చేసుకున్నారు. 16 రోజులు 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 28న వరంగల్ తూర్పు, పశ్చిమ, గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 28 వరకు 54 సభల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే తొలి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇవాళ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. భద్రాచలం, పినపాక కలిపి ఒకే సభ ఉండనుంది. 14న పాలకుర్తి, నాగార్జునసాగర్(హాలియా), ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్, 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్, 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18న జనగాంలో రోడ్డుషో, 19న ఆలంపూర్, కల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్లగొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరువు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25న హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి, 28న వరంగల్ (ఈస్ట్+వెస్ట్), గజ్వేల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?