Festival of Ponds: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా చెరువుల పండగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల పండుగ నిర్వహించనున్నారు. చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజలు నిర్వహించడంతో పాటు బోనాలు, బతుకమ్మలు, ప్రగతి నివేదికల సమర్పణకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం మిషన్ కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులతో పాటు మిషన్ కాకతీయ దాతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,531 చెరువులున్నాయి. వాటి కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు గుర్తించారు. దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద ‘మిషన్ కాకతీయ’ పనులను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,527 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు పైగా పెరిగింది. ఇప్పటి వరకు 15 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేశారు. ఆయా పంట కాల్వలకు ఓటీలు ఏర్పాటు చేసి ప్రాజెక్టు నీటితో సక్రమంగా చెరువులను నింపుతున్నారు.
దీంతో ఎండా కాలంలో కూడా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉండడంతో చెరువులు నిండుతున్నాయి. మరోవైపు వాగుల పునరుజ్జీవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 1200 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని భావించగా, ఇప్పటికే 650 పనులు ప్రారంభించగా 400 పూర్తయ్యాయి. దీంతో ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండగా, మరోవైపు సంబంధిత రంగాల విస్తరణ శరవేగంగా సాగుతోంది. మత్స్య పరిశ్రమ కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా పశువులకు, పాడి పశువులకు నీటి కొరత ఉండదు. తెలంగాణ ఇప్పుడు డెయిరీ అభివృద్ధికి చిరునామా. పశువులు మరియు పాల పెరుగుదలతో పాటు, ఇతర నిపుణులకు కూడా ఈ రోజు కొత్త అవకాశాలు ఉన్నాయి.
New York: న్యూయార్క్‌లో తీవ్ర స్థాయిలో కాలుష్యం