Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Today Is The Festival Of Ponds Across The State

Festival of Ponds: నేడే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పండగ

Published Date :June 8, 2023 , 10:05 am
By NTV WebDesk
Festival of Ponds: నేడే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పండగ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Festival of Ponds: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా చెరువుల పండగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల పండుగ నిర్వహించనున్నారు. చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజలు నిర్వహించడంతో పాటు బోనాలు, బతుకమ్మలు, ప్రగతి నివేదికల సమర్పణకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం మిషన్ కాకతీయ డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులతో పాటు మిషన్‌ కాకతీయ దాతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,531 చెరువులున్నాయి. వాటి కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు గుర్తించారు. దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద ‘మిషన్ కాకతీయ’ పనులను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,527 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు పైగా పెరిగింది. ఇప్పటి వరకు 15 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేశారు. ఆయా పంట కాల్వలకు ఓటీలు ఏర్పాటు చేసి ప్రాజెక్టు నీటితో సక్రమంగా చెరువులను నింపుతున్నారు.

దీంతో ఎండా కాలంలో కూడా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉండడంతో చెరువులు నిండుతున్నాయి. మరోవైపు వాగుల పునరుజ్జీవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 1200 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని భావించగా, ఇప్పటికే 650 పనులు ప్రారంభించగా 400 పూర్తయ్యాయి. దీంతో ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండగా, మరోవైపు సంబంధిత రంగాల విస్తరణ శరవేగంగా సాగుతోంది. మత్స్య పరిశ్రమ కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా పశువులకు, పాడి పశువులకు నీటి కొరత ఉండదు. తెలంగాణ ఇప్పుడు డెయిరీ అభివృద్ధికి చిరునామా. పశువులు మరియు పాల పెరుగుదలతో పాటు, ఇతర నిపుణులకు కూడా ఈ రోజు కొత్త అవకాశాలు ఉన్నాయి.
New York: న్యూయార్క్‌లో తీవ్ర స్థాయిలో కాలుష్యం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Festival of Ponds
  • mission kakatiya
  • ponds
  • Telangana State Decade Celebrations

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions